Shanmukha: ఆది, అవికా మూవీ రిలీజ్ డేట్ లాక్డ్

ABN , Publish Date - Mar 01 , 2025 | 03:54 PM

ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా నటించిన డివోషనల్ థ్రిల్లర్ మూవీ 'షణ్ముఖ'. సాపాని బ్రదర్స్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ మార్చి 21న విడుదల కానుంది.

డివోషనల్ కంటెంట్ ఉన్న సినిమాలకు ఇటీవల ప్రేక్షకాదరణ లభిస్తోంది. దాంతో చాలామంది దర్శక నిర్మాతలు ఆ తరహా చిత్రాలను రూపొందించడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే... అందులోనూ నిర్మాణపరంగా ఉన్నత స్థాయిలో ఉన్న చిత్రాలనే జనాలు ఆదరిస్తున్నారు. అలాంటి చిత్రమే తమదని 'షణ్ముఖ' (Shanmukha) చిత్ర నిర్మాతలు సాపాని బ్రదర్స్ (Sapani Brothers) చెబుతున్నారు. గతంలో 'శాసనసభ' (Sasana Sabha) చిత్రాన్ని నిర్మించిన వీరు ఇప్పుడు 'షణ్ముఖ' పేరుతో సస్పెన్స్ థ్రిల్లర్ ను రూపొందించారు.


adi1 copy.jpg

షణ్ముగం సాపాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆది సాయికుమార్ (Adi Saikumar), అవికా గోర్ (Avika gor) జంటగా నటించారు. దీనిని తులసీరామ్ సాపాని, షణ్ముగం సాపాని, రమేశ్‌ యాదవ్ నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోందని, మార్చి 21న ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయబోతున్నామని మేకర్స్ తెలిపారు. 'కేజీఎఫ్‌ (KGF), సలార్ (Salaar)' చిత్రాలకు సంగీతం అందించిన రవి బసూర్ దీనికి మ్యూజిక్ అందించారు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ విషయంలో ఎంతో శ్రద్థ తీసుకున్నామని వారు అన్నారు. ఆది సాయికుమార్ కెరీర్ లో ఈ సినిమా ఓ మైలు రాయిగా నిలుస్తుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ డివోషనల్ థ్రిల్లర్ మూవీలో ఆది సాయికుమార్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించారు.

Also Read: Kannappa Teaser: ‘కన్నప్ప’ టీజర్‌.. ఇది ఆన .. తిన్నడి ఆన..

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 01 , 2025 | 03:54 PM