Bangalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్
ABN , Publish Date - Jan 02 , 2025 | 04:48 PM
Bangalore Rave Party: సంచలన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఎవరు ఊహించని ట్విస్ట్ ఏర్పడింది. టాలీవుడ్ నటి హేమ న్యాయవాది వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయం వెల్లడించింది.
గతేడాది ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు ఊరట లభించింది. ఈ కేసులో నటి హేమతో పాటు మరికొంత మంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదురుకున్న విషయం తెలిసిందే. ఇందులో బెంగళూరు పోలీసులు నటి హేమతో పాటు మొత్తం 88 మందిని నిందితులుగా చేరుస్తు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు తాజాగా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో నటి హేమకు భారీ ఊరట లభించింది. ఇంతకీ కర్ణాటక హైకోర్టు ఏం చెప్పిందంటే..
తాజాగా నటి హేమ న్యాయవాది కోర్టులో హేమ ఎలాంటి నిషేదిత డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆధారాలు లేవని వాదనలు వినిపించారు. అనంతరం పోలీసుల వాదన విన్న కోర్టు.. ఈ కేసుపై మధ్యంతర స్టే విధించింది. సుమారు నాలుగు వారాలు ఈ స్టే కొనసాగనుంది. ఇప్పటికే హేమ తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని పలుమార్లు స్పష్టం చేశారు. గతంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవడానికి ప్రయత్నాలు కూడా చేసింది.
అలాగే ఈ కేసు వ్యవహారంలో ఆమెపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నిషేధం విధిస్తూ.. ‘మా’ (MAA) నిర్ణయం తీసుకుంది. హేమ విచారణలో నిజంగా తప్పు చేసినట్లు తెలిస్తే.. ‘మా’ ఆమెను బ్యాన్ చేస్తుందని అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించి.. ఆ వెంటనే ఆమెపై బ్యాన్ విధించారు. తర్వాత ఆమెపై ‘మా’ నిషేధం ఎత్తివేసినట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.