Saptagiri: మహారాజు లాంటి మనస్తత్వం ఆయనది

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:53 PM

వెంకట ప్రభు ప్రసాద్‌.. ఈ పేరు అంతగా ఎవరికీ గుర్తుకురాకపోవచ్చు. కానీ ‘సప్తగిరి’ అనగానే ప్రేక్షకులు వెంటనే గుర్తుపట్టేస్తారు. సప్తగిరి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి పదిహేనేళ్లు అవుతోంది. సప్తగిరి జీవితంలో ఎవరూ ఊహించని కొన్ని కోణాలున్నాయి.

‘రాజాసాబ్‌’ (The Raja Saab) చిత్రం హాస్యనటుడిగా నన్ను మళ్లీ నిలబెడుతుంది. ప్రభాస్‌ అన్న పక్కన దాదాపు సినిమా అంతా ఉంటా" అని సప్తగిరి(Saptagiri) అన్నారు. హాస్య నటుడిగా కెరీర్ మొదలు పెట్టి హీరోగా కూడా సినిమాలు చేస్తున్నారాయన.  వెంకట ప్రభు ప్రసాద్‌.. ఈ పేరు అంతగా ఎవరికీ గుర్తుకురాకపోవచ్చు. కానీ ‘సప్తగిరి’ అనగానే ప్రేక్షకులు వెంటనే గుర్తుపట్టేస్తారు. సప్తగిరి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి పదిహేనేళ్లు అవుతోంది. ఈ తరం హాస్యనటుల్లో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి జీవితంలో ఎవరూ ఊహించని కొన్ని కోణాలున్నాయి. కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ ఇప్పుడు ‘పెళ్లికాని ప్రసాద్‌’ (pellikani prasad) చిత్రంతో హీరోగా వస్తున్న సప్తగిరితో ‘నవ్య’ ఇంటర్వ్యూలో అయన చెప్పుకొచ్చిన ఆసక్తికర విషయాలు.. 


Prabhas

‘రాజాసాబ్‌’ చిత్రం హాస్యనటుడిగా నన్ను మళ్లీ నిలబెడుతుంది. ప్రభాస్‌ అన్న పక్కన దాదాపు సినిమా అంతా ఉంటా. ‘పెళ్లికాని ప్రసాద్‌ టీజర్‌ రిలీజ్‌ చేసింది ప్రభాస్‌ అన్నే. సినిమాలో కొన్ని సీన్స్‌ చూసి ఇష్టపడి ‘‘ఈ సినిమాను నేను ప్రమోట్‌ చేస్తా’’ అని ముందుకు వచ్చారు. మహారాజు లాంటి మనస్తత్వం ఆయనది.

ఏ మనిషి జీవితంలోనైనా ఒడుదొడుకులు సహజం. ఆ స్ట్రగుల్‌ నాకూ ఉంది. ఓపిక, సహనం ఉండాలి. సినిమా జీవితం అదే నాకు నేర్పించింది. ఇక్కడకు వచ్చి పోగొట్టుకున్నది ఏదీ లేదు.

శత్రువులు నా జోలికి రాకుండా ఉంటే చాలు. అదే పదివేలు. నేను ఎదురు తిరిగే వ్యక్తిని కాదు, స్టేట్‌మెంట్లు ఇచ్చే రకాన్ని కూడా కాదు. ‘‘నా బతుకు నే బతుకుతాను. నా దారిన నన్ను పోనివ్వండి’’ అని బతిమాలుకునే మనిషిని నేను.

ALSO READ: సప్తగిరి ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 16 , 2025 | 01:05 PM