Thandel: నార్త్ మార్కెట్‌ని కొల్లగొట్టేందుకు చైతన్య ప్లాన్

ABN , Publish Date - Jan 30 , 2025 | 08:04 PM

Thandel: ఒక సౌతిండియన్ సినిమా నార్త్ మార్కెట్‌ని కొల్లగొట్టేందుకు కావాల్సిన ప్రైమరీ ఎలిమెంట్స్ 'దేశభక్తి', 'యాక్షన్ సీక్వెన్స్'. ఇదే ప్లాన్‌తో హీరో నాగచైతన్య హిందీ బెల్ట్‌ని టార్గెట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Aamir Khan to launch Hindi trailer of Naga Chaitanya's Thandel

యువ సామ్రాట్ నాగ చైతన్య, డ్యాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి జంటగా.. చందూ మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘తండేల్’. 2025లో రిలీజ్ కానున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ‘తండేల్’ ఒకటి. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ‘బుజ్జి తల్లి, శివ శక్తి, హైలెస్సో హైలెస్సా’ పాటలు మ్యూజిక్ చార్టులలో టాప్ ప్లేస్‌లో, అలాగే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ కు కూడా మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే మూవీ మేకర్స్ హిందీ బెల్ట్ లోను ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.


ఇప్పటికే దర్శకుడు చందు మొండేటికి 'కార్తికేయ 2'తో నార్త్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. యాక్షన్ సీన్స్ తో పాటు దేశభక్తి కూడిన సన్నివేశాలు నార్త్ ఆడియెన్స్ ని ఆకర్షించడంలో కీలక పోషించనున్నాయి. ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న అల్లు అరవింద్ కు నార్త్ ఆడియెన్స్ ని ఎలా ఆకర్షించాలో బాగా తెలుసు. అయితే హీరో నాగ చైతన్య కూడా ఇప్పటికే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఖాన్ 'అమీర్ ఖాన్' 'లాల్ సింగ్ చద్దా'లో కీలక పాత్రలో నటించి పర్వాలేదనిపించాడు. ఈ క్రమంలోనే అమీర్, చైతూల మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. దీంతో 'తండేల్' మేకర్స్ ఈ సినిమా హిందీ ట్రైలర్ ని శుక్రవారం అమీర్ ఖాన్ చేతుల మీదుగా లాంఛ్ చేయించనున్నారు. మరి రూ. 70 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ సినిమా చైతన్య కెరీర్ లో ఎంతో కీలకంగా మారనుంది. మరోవైపు ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ ని పూర్తి చేసుకుంది. అలాగే యు/ఎ సర్టిఫికెట్ ను పొందింది. ఈ సినిమా 2 గంటల 32 నిమిషాల నిడివితో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Also Read- Bad Girl: సమాజంలో కులం ఉంది కాబట్టే సినిమాల్లో కులం

Also Read- Spirit: రెబల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్పిరిట్ షూటింగ్ అప్పుడే

Also Read- Kangana Ranaut: కాజోల్‌, దీపికా ముద్దు.. మేమంటే చేదు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 30 , 2025 | 08:11 PM