SS Rajamouli: షూటింగ్ స్పాట్.. కాస్త సివిక్ సెన్స్ తో ఆలోచించండి...
ABN , Publish Date - Mar 20 , 2025 | 12:00 AM
తన చిత్రాల షూటింగ్ గురించి ఎంతో గోప్యంగా ఉంచే రాజమౌళి.. తన తాజా చిత్రం SSMB29 షూటింగ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
తన చిత్రాల షూటింగ్ గురించి ఎంతో గోప్యంగా ఉంచే రాజమౌళి.. తన తాజా చిత్రం #SSMB29 షూటింగ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఒడిశాలోని అత్యంత ఎత్తైన శిఖరం దేవ్‌మాలిని సోలోగా ట్రెక్కింగ్ చేసినట్టు రాజమౌళి (Rajamouli) తెలిపారు. ఆ పర్వతంపై నుంచి వ్యూ అద్భుతంగా ఉందని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అయితే అక్కడ అపరిశుభ్ర పరిస్థితులు తనను బాధించాయని రాసుకొచ్చారు. "చిన్న సివిక్ సెన్స్ తో అక్కడ ఎంతో మార్పు తీసుకురావచ్చు. ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉండేందుకు.. సందర్శకులంతా తాము వినియోగించిన ప్లాస్టిక్ వస్తువులు తదితర వాటిని తిరిగి వెనక్కి తీసుకెళ్లాలి. ఆలా చేస్తే ఆ అద్భుత ప్రాంతం ఎంతో శుభ్రంగా ఉంటుంది" అని ట్వీట్లో పేర్కొన్నారు.
మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న #SSMB29 (వర్కింగ్ టైటిల్) ఓ షెడ్యూల్ చిత్రీకరణ ఒడిశాలో మంగళవారం రాత్రి పూర్తయిన సంగతి తెలిసిందే. గత రెండు వారాలుగా ఈ సినిమా షూటింగ్ కోరాపుట్ జిల్లాలో జరిగింది. సిమిలిగుడ సమీపంలోని మాలి, పుట్‌సీల్, బాల్డ ప్రాంతాల్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా తదితరులు ఈ షూటింగ్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఫోటోలు, వీడియోలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.