Priya Kommineni: ఇంజనీరింగ్ చదివి 'తకిట తదిమి తందాన'...
ABN , Publish Date - Mar 01 , 2025 | 03:11 PM
తెలుగు కథానాయికలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఖమ్మంకు చెందిన ప్రియా కొమ్మినేని 'తకిట తదిమి తందాన' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తనకు చక్కని గుర్తింపు తెస్తోందని ప్రియా చెబుతోంది.
ప్రియా కొమ్మినేని (Priya Kommineni)... ఖమ్మం అమ్మాయి. చదివింది ఇంజనీరింగ్. ఆ పైన కొద్దిరోజులు ఉద్యోగమూ చేసింది. అయితే నటన మీద ఉన్న ఆసక్తితో కొంతకాలంగా సినిమాలలో అవకాశం కోసం ప్రయత్నాలు చేసింది. ఫలితంగా 'తకిత తదిమి తందాన' (Takita Tadimi Tandana) అనే చిత్రంలో ఆమెకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా తనకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతోందని ప్రియా కొమ్మినేని చెబుతోంది.
చిన్నప్పటి నుండి సినిమాలంటే చెప్పలేనంత ఇష్టమని, స్కూల్, కాలేజీల్లో జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్స్ లో యాక్టివ్ గా పాల్గొనే దాన్నని తెలిపింది ప్రియా. తొలి చిత్రం 'తకిట తధిమి తందనా' నటిగా గుర్తింపు ఇవ్వడంతో ఇక చిత్రసీమలోనే కొనసాగాలని డిసైడ్ అయ్యానని చెప్పింది. సినిమా రంగంలో తనకంటూ ఓ చిన్న స్థానాన్ని సంపాదించుకోవాలన్నది తన పెద్ద కోరిక అంటోంది ప్రియా కొమ్మినేని. తనకు 'తకిట తదిమి తందాన'లో హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన నిర్మాత చందన్, దర్శకుడు రాజ్ రోహిత్ కు ప్రియ కృతజ్ఞతలు తెలిపింది.
Also Read: Actress Rambha: మళ్ళీ మరోసారి అలరిస్తానంటున్న రంభ
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి