Allari Naresh: క్రేజీ కాంబోతో 12ఎ రైల్వే కాలనీ

ABN , Publish Date - Mar 17 , 2025 | 04:58 PM

అల్లరి నరేశ్ సైతం హారర్ జానర్ కు మొగ్గు చూపుతున్నాడు. పొలిమేర ఫేమ్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షో రన్నర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు '12ఎ రైల్వే కాలనీ' అనే పేరు పెట్టారు. సమ్మర్ లో ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది.

'అల్లరి' నరేశ్‌ (Allari Naresh) ఇప్పుడు తన రూట్ మార్చాడు. హారర్ బ్యాక్ డ్రాప్ లో '12ఎ రైల్వే కాలనీ' (12 A Railway Colony) అనే మూవీ చేస్తున్నాడు. ఈ జానర్ లో సినిమా... అదీ అల్లరి నరేశ్‌ తో అనగానే సహజంగా హారర్ కామెడీ అనుకుంటారు. కానీ ఇది చెమటలు పట్టించే హారర్ మూవీ అని తాజాగా విడుదల చేసిన టైటిల్ గ్లిమ్స్ చూస్తే అర్థమౌతోంది. ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి (Srinivasaa Chitturi) ప్రొడ్యూసర్ గా పవన్ కుమార్ సమర్పణలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. 'పొలిమేర (Polimera) పొలిమేర -2' చిత్రాల దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ (Dr Anil Vishwanath) ఈ మూవీకి షో రన్నర్. 'పొలిమేర, పొలిమేర -2' చిత్రాలలో నాయికగా నటించిన డాక్టర్ కామాక్షి భాస్కర్ల (Dr Kamakshi Bhaskarla) ఇందులో హీరోయిన్. అనిల్ విశ్వనాథ్ ఆమెతో వరుసగా చేస్తున్న మూడో చిత్రం ఇది. అయితే ఈ సినిమాకు ఆయన షో రన్నర్ గా వ్యవహరించడంతో పాటు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. నాని కాసరగడ్డ దీనికి డైరెక్టర్ కమ్ ఎడిటర్.


తాజాగా విడుదలై గ్లింప్స్ లో అల్లరి నరేష్ ఒక కిటికీ దగ్గర నిలబడి, ఆలోచనలో, ధ్యాన ముద్రలో కనిపిస్తాడు. వైవా హర్ష వాయిస్ ఓవర్‌తో ఇది సాగింది. టీజర్ వింతైన, కలవరపెట్టే సంఘటనలతో ఎక్సయిటింగ్ గా ఉంది. కనిపించే ప్రతి పాత్ర కూడా అనుమానాస్పదంగా వుంది. అల్లరి నరేష్ పాత్ర ఒకరిని షూట్ చేసి నవ్వడం ప్రేక్షకులను ఆ పాత్ర గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించేలా వుంది. ఇందులో ఇతర కీలక పాత్రలను సాయి కుమార్ (Sai Kumar), వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనిష్ కురువిల్లా, మధుమణి పోషిస్తున్నారు. సమ్మర్ లో జనం ముందుకు రాబోతున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

Also Read: Priyadarshi: కోర్టుతో సారంగపాణి జాతకం మార్పు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 17 , 2025 | 04:59 PM