Veera Dheera Sooran-2: రేర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ తో విక్రమ్ సినిమా

ABN , Publish Date - Mar 06 , 2025 | 07:03 PM

విక్రమ్ నటించిన 'తంగలాన్' చిత్రం గత యేడాది ఆగస్ట్ 15న విడుదలైంది. నటుడిగా విక్రమ్ మంచి మార్కులు పొందినా... ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులనే మెప్పించింది. అయితే తాజా చిత్రం 'వీర ధీర శూరన్' యాక్షన్ చిత్రాల ప్రియులను ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు.

మణిరత్నం (Mani Ratnam) 'పొన్నియిన్ సెల్వన్'తో మరోసారి నటుడిగా తన సత్తాను చాటుకున్నాడు చియాన్ విక్రమ్ (Chiyaan Vikram). అయితే ఆ తర్వాత వచ్చిన 'తంగలాన్' (Thangalan) మాత్రం రా కంటెంట్ కారణంగా ఒక వర్గం ప్రేక్షకులను మెప్పించగలిగింది. నటుడిగా విక్రమ్ అద్భుతమైన నటన ప్రదర్శించినా... అది అందరినీ అలరించడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో విక్రమ్ నటించిన మరో చిత్రం 'వీర ధీర సూరన్' (Veera Dheera Sooran) పార్ట్ -2 మార్చి 27న విడుదల కాబోతోంది.

Also Read: Chhaava: తెలుగులోనూ తగ్గేదే లే అంటున్న విక్కీ కౌశల్


'వీర ధీర సూరన్ -2' చిత్రాన్ని ఎస్.యు. అరుణ్‌ కుమార్ (S.U. Arun Kumar) తెరకెక్కించారు. ఎస్.జె. సూర్య (SJ Surya) , సూరజ్ వెంజరాముడు, దుషార విజయన్ కీలక పాత్రలు పోషించారు. రియా శిబు నిర్మించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ (G.V. Prakash Kumar) సంగీతం అందించాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సీట్ ఎడ్జ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. తెలుగులో ఈ సినిమాను ఎన్వీఆర్ సినిమాస్ సంస్థ విడుదల చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయని, వాటిని అందుకునేలా దర్శకుడు అరుణ్ కుమార్ మూవీని తెరకెక్కించాడని రియా శిబు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 06 , 2025 | 10:47 PM