Vijay Sethupathi: గందరగోళానికి గురి కాకుండా దయచేసి ఆ మార్పు చేయండి..

ABN , Publish Date - Jan 30 , 2025 | 10:26 AM

పాన్‌ కార్డ్‌కు సంబంధించి కొన్ని మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని నటుడు మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌  సేతుపతి అభ్యర్థించారు.

పాన్‌ కార్డ్‌కు (Pan Card) సంబంధించి కొన్ని మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని నటుడు మక్కల్‌ సెల్వన్‌ విజయ్ సేతుపతి (Vijay Setupathi) అభ్యర్థించారు. పాన్‌ కార్డుకి సంబంధించిన సమాచారం, అప్‌డేట్‌లను తమిళంలోనూ అందుబాటులో ఉంచాలని కోరారు. తాజాగా ఓ ఈవెంట్‌లో విజయ్‌ సేతుపతి  మాట్లాడుతూ "పాన్‌ కార్డు వివరాలు ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీని వల్ల ఈ భాషలు రాని వారు పాన్‌ కార్డ్‌ అప్‌డేట్‌ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


తమిళనాడులోని ప్రజలకు పాన్‌కార్డు (Tamil Language for Pan Card) విషయంలో సమస్యలు ఎదురైనప్పుడు వారికి అర్థమయ్యే భాషలో సమాచారం ఉంటే వారు గందరగోళానికి గురికారు. తమిళ భాషను జత చేయడం కష్టమైనప్పటికీ ప్రయత్నించాలని కోరుతున్నాను. పాన్‌ కార్డు వెబ్‌సైట్‌లో తమిళంలో సమాచారం అందుబాటులో ఉంటే అది మరింత ఎక్కువమందికి చేరుతుంది’’ అని అన్నారు. భాషతో సంబంధం లేకుండా పౌరులందరికీ అవసరమైన ఆర్థిక సమాచారాన్ని సులభంగా యాక్సెస్‌ చేసేలా  పాన్‌కార్డు సంబంధిత అప్‌డేట్‌లను బహుళ భాషల్లో అందుబాటులో ఉండేలా చూడాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

విజయ్‌ సేతుపతి సినిమా విషయానికొస్తే.. ‘విడుదల 2’తో మరోసారి తెలుగు ఆడియన్స్‌ ముందుకొచ్చారు. విజయ్‌ సేతుపతి, సూరి కీలక పాత్రల్లో దర్శకుడు వెట్రిమారన్‌ రూపొందించిన చిత్రమిది. మంజూ వారియర్‌ కీలక పాత్రధారి. గత ఏడాది  విడుదలై మెప్పించిన ‘విడుదల పార్ట్‌ 1’కి సీక్వెల్‌గా ఈ చిత్రం వచ్చింది. రెండోపార్ట్‌ కూడా చక్కని ఆదరణ దక్కించుకుంది.

Updated Date - Jan 30 , 2025 | 10:26 AM