Toxic: నెల రోజుల షూటింగ్‌.. అంతా వృధానే..

ABN , Publish Date - Jan 30 , 2025 | 02:15 PM

అలాంటిది నెల రోజులు షూటింగ్‌ చేశాక.. ఆ ఫుటేజ్‌ అంతా డస్ట్‌ బిన్‌లో పడేయాల్సి వస్తే  ఎలా ఉంటుంది? నిర్మాతకు ఎన్ని కోట్లు నష్టం? ఆ దర్శకుడు, టీమ్‌ కష్టం ఎంత వృధా అయినట్టు? ఈ మధ్య తరచూ కొన్ని పెద్ద సినిమాలు ఎదుర్కొంటున్న సమస్య ఇది.


పెద్ద సినిమాకు (Big budget movies) ఓ రోజు షెడ్యూల్‌ ఖర్చంటే తక్కువలో తక్కువ రూ. 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ అవుతుంది. అదే చిత్రానికి దర్శకులు రాజమౌళి, శంకర్‌ లాంటి వారైతే ఆ ఖర్చు మరోలా ఉంటుంది. అలాంటిది నెల రోజులు షూటింగ్‌ చేశాక.. ఆ ఫుటేజ్‌ అంతా డస్ట్‌ బిన్‌లో పడేయాల్సి వస్తే  ఎలా ఉంటుంది? నిర్మాతకు ఎన్ని కోట్లు నష్టం? ఆ దర్శకుడు, టీమ్‌ కష్టం ఎంత వృధా అయినట్టు? ఈ మధ్య తరచూ కొన్ని పెద్ద సినిమాలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. షూటింగ్‌ జరుపుకొన్న తరవాత రషెష్‌ చూసుకోవడం, నచ్చకపోతే పక్కన పెట్టేసి, రీషూట్‌కి వెళ్లడం Re shoot). ఇలాంటి వ్యవహారాలతో బడ్జెట్‌ దాటిపోయి నిర్మాతలు నిలువునా ఇబ్బందుల్లో ఇరుక్కుంటున్నారు. యశ్‌ (yash) కొత్త సినిమా ‘టాక్సిక్‌’ విషయంలో ఇదే జరిగిందని ఇన్‌ సైడ్‌ వర్గాల నుంచి సమాచారం. (Toxic One month Shoot waste))



'కేజీఎఫ్‌'తో (KGF) పాపులారిటీ తెచ్చుకొని పాన్‌ ఇండియా స్థాయిలో స్టార్‌ అయిపోయాడు యశ్‌. తన తదుపరి సినిమా కోసం చాలా ఆలోచించాడు. చివరికి మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌ చెప్పిన కథని ఓకే చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో వుంది. ఇటీవల యశ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఓ టీజర్‌ విడుదల చేశారు. కేజీఎఫ్‌ తరువాత వస్తున్న సినిమా కాబటి అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ మధ్యనే ముంబైలో నెల రోజ.ఉలపాటు భారీ షెడ్యూల్‌ చేశారు. తీరా చూస్తే ఆ అవుట్‌పుట్‌లో ఏదీ హీరోకి నచ్చలేదట. దాంతో తీసిన సన్నివేశాలన్నీపక్కన పడేసి రీషూట్‌కి వెళ్లాల్సివస్తోంది. ఈ నెల రోజుల షెడ్యూల్‌ వృధా అయినట్టే. ఈ నెల రోజుల షూటింగ్‌ కోసం ఎంత ఖర్చు పెట్టారో నిర్మాతకే తెలియాలి. పెద్ద సినిమాలతో వచ్చే సమస్య ఇది. బడ్జెట్‌లు ఉన్నాయి కదా అని ఎడా పెడా వాడేస్తుంటారు. చివరికి సినిమా హిట్టయిన కూడా నిర్మాతకు నష్టాలే మిగులుతాయి. మరి.. 'టాక్సిక్‌' భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.

Updated Date - Jan 30 , 2025 | 02:15 PM