Thudarum: ఫ్యామిలీ మ్యాన్ గా మోహన్ లాల్...

ABN , Publish Date - Apr 23 , 2025 | 03:08 PM

మోహన్ లాల్, శోభన జంటగా నటించిన మలయాళ చిత్రం 'తుడరుమ్' తెలుగులోనూ డబ్ అవుతోంది. ఈ సినిమాను ఈ నెల 26న రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయబోతున్నారు.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'తుడరుమ్'. వెటరన్ హీరోయిన్ శోభన ఇందులో మోహన్ లాల్ కి జోడిగా నటించారు. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎం. రంజిత్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఎమోషన్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రోలర్ కోస్టర్ రైడ్ గా ఉన్న ట్రైలర్ కట్టిపడేసింది. మోహన్ లాల్ ట్యాక్సీ డ్రైవర్ గా ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించిన తీరు ఆకట్టుకుంది.


thudarum without titles family poster.jpgఓ కారు, ఫ్యామిలీ చుట్టూ ఆసక్తికరంగా నడిచిన 'తుడరుమ్' ట్రైలర్ సినిమాపై కథపై చాలా క్యురియాసిటీని పెంచింది. మోహన్ లాల్ నేచురల్ అండ్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ హైలెట్ గా నిలువబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. దర్శకుడు తరుణ్ మూర్తి కథని చాలా ఆసక్తికరంగా ప్రజెంట్ చేశాడు. జేక్స్ బిజోయ్ నేపధ్య సంగీతం అందించగా, షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ సమకూర్చారు. మణియంపిల్ల రాజు,బిను పప్పు, ఇర్షాద్ అలీ, ఫర్హాన్ ఫాజిల్ , థామస్ మాథ్యూ, షైజో ఆదిమాలి ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను తెలుగులో దీపా ఆర్ట్స్ అధినేత పి. శ్రీనివాస్ గౌడ్ ఏప్రిల్ 26న విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా మలయాళ వర్షన్ మాత్రం ఒక రోజు ముందు 25నే రిలీజ్ అవుతోంది.

Also Read: Emergency: కంగనాపై కోర్టు కెక్కిన రచయిత్రి

Also Read: Super Star: సితారతో మహేశ్... ఆ గ్రేసే వేరు....

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 23 , 2025 | 03:09 PM