Shruti haasan: పులి తర్వాత మళ్లీ కుదిరినట్టేనా 

ABN , Publish Date - Feb 11 , 2025 | 07:59 AM

అగ్రహీరో విజయ్‌ నటిస్తున్న 69వ (Vijay 69) చిత్రంలో హీరోయిన్‌ శృతిహాసన్‌ (Shruti Haasan) ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్టు ప్రచారం జరుగుతుంది.

అగ్రహీరో విజయ్‌ నటిస్తున్న 69వ (Vijay 69) చిత్రంలో హీరోయిన్‌ శృతిహాసన్‌ (Shruti Haasan) ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్టు ప్రచారం జరుగుతుంది. గతంలో విజయ్‌ సరసన ‘పులి’ సినిమాలో శృతి హీరోయిన్‌గా నటించారు.  సుదీర్ఘకాలం తర్వాత వీరిద్దరూ మళ్ళీ కలిసి నటించబోతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్‌ ‘కూలీ’ (Coolie) సినిమాలో శృతి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ థాయ్‌లాండ్‌లో జరుగుతుంది. రజనీకాంత్‌, శృతిహాసన్‌ ఇటీవలే థాయ్‌ నుంచి చెన్నై తిరిగి వచ్చారు.


Shrutjhi.jpg

అదే సమయంలో విజయ్‌ 69వ చిత్రం ‘జన నాయగన్‌’ (Jana Nayagan) షూటింగ్‌ నగర శివారు ప్రాంతమైన పనైయూరులో జరుగుతుంది. ఈ షూటింగ్‌లో శృతిహాసన్‌ పాల్గొన్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో బాబీ డియోల్‌, మమితా బైజు, గౌతం వాసుదేవ మేనన్‌, ప్రకాష్‌ రాజ్‌, వరలక్ష్మి, డీజే అరుణాచలం తదితరులు నటిస్తున్నారు. కేవీఎన్‌ ప్రొడక్షన్‌ పతాకంపై రూపొందే ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన హీరో విజయ్‌ నటించే చివరి చిత్రం ఇదేనంటూ ప్రచారం సాగుతున్న విషయం తెల్సిందే.

Updated Date - Feb 11 , 2025 | 08:12 AM