Vishal Health Update: విశాల్ హెల్త్‌పై పర్సనల్ మేనేజర్ ఏమన్నారంటే..
ABN , Publish Date - Jan 10 , 2025 | 11:06 AM
Vishal Health Update: ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం విశాల్‌కు గడ్డు కాలం నడుస్తోంది. చెన్నై అపోలో హాస్పిటల్ వర్గాలు, ప్రొడ్యూసర్, సీనియర్ యాక్ట్రెస్ ఖుష్బూ విశాల్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చినా.. పలువురు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేశారు.న దీంతో విశాల్ మేనేజర్, హీరో జయం రవి స్పందించారు.
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన ఏర్పడిన నేపథ్యంలో వరుసగా డాక్టర్లు, ఆయన స్నేహితులు, సినీ తారలు ఆయన హెల్త్ అప్డేట్స్ షేర్ చేసుకుంటున్నారు. తాజాగా మరో కోలీవుడ్ హీరో, విశాల్ స్నేహితుడు జయం రవి.. విశాల్ హెల్త్ గురించి కొన్ని విశేషాలు షేర్ చేసుకున్నారు. అలాగే విశాల్ మేనేజర్ కూడా ఓ పోస్టు చేశారు. ఇంతకు వాళ్ళు ఏమన్నారు? విశాల్ హెల్త్ ఓకేనా? అసలు ఏం జరిగిందంటే..
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో విశాల్ హెల్త్ గురించి హీరో జయం రవి మాట్లాడుతూ.. " విశాల్ మంచి మనసు ఉన్న వ్యక్తి. ఎంతోమందికి సేవ చేశారు. ప్రస్తుతం ఆయనకు గడ్డు కాలం నడుస్తోంది. త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తారు. సింహంలా గర్జిస్తారు. అతి త్వరలోనే ఆయన కోలుకుంటారు" అంటూ చెప్పారు. మరోవైపు విశాల్ మేనేజర్ సోషల్ మీడియా ద్వారా పోస్టు చేస్తూ.. 'విశాల్ వైరల్ ఫీవర్, తీవ్రమైన నొప్పులతో ఆయన ఇబ్బంది పడుతున్నారు.. వైద్యులు ఆయనకు విశ్రాంతి సూచించారని. అయినప్పటికీ సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన ఆరోజు ఈవెంట్‌కు హాజరయ్యాడు. సోషల్‌మీడియాలో జరుగుతోన్న ప్రచారాన్ని ఏమాత్రం నమ్మొద్దు' అంటూ కోరుతూ పోస్టు పెట్టారు.
ఏం జరిగిందంటే..
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ లేటెస్ట్ ఫిల్మ్ ‘మదగజరాజ’ మూవీ ఈవెంట్ లో ఆయన వణుకుతూ కనిపించారు. ఆయన రూపంలో కూడా పలు మార్పులు కనిపించాయి. దీంతో ఈ విజువల్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఇవి చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత చెన్నై అపోలో హాస్పిటల్ వర్గాలు, ప్రొడ్యూసర్, సీనియర్ యాక్ట్రెస్ ఖుష్బూ విశాల్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చినా.. పలువురు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేశారు.