Vishal: హీరో విశాల్ హెల్త్‌పై డాక్టర్లు ఏమన్నారంటే..
ABN , Publish Date - Jan 06 , 2025 | 04:56 PM
Vishal: హీరో విశాల్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళా చెన్నై అపోలో డాక్టర్లు అప్డేట్ అందించారు. ఇటీవలే జరిగిన ఆయన మదగజరాజ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన వణుకుతూ కనిపించారు.
హీరో విశాల్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళా చెన్నై అపోలో డాక్టర్లు అప్డేట్ అందించారు. ఇటీవలే జరిగిన ఆయన మదగజరాజ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన వణుకుతూ కనిపించారు. అలాగే గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆయన వేదికపై మాట్లాడుతుంటే చేతులు వణికాయి. చాలా నిదానంగా మాట్లాడారు. సరిగ్గా నడవలేకపోయారు. చాలామంది ఆయనను పరామర్శించడం కూడా కనిపించింది. దీంతో అభిమానులు కంగారు పడ్డారు.
దీనిపై తాజాగా చెన్నై అపోలో డాక్టర్లు స్పందిస్తూ.. " ప్రస్తుతం విశాల్ ఒక వైరల్ ఫీవర్ తో పోరాడుతున్నారు. ఆయనకు చికిత్స అందిస్తున్నాము. పూర్తిగా బెడ్ రెస్ట్ అవసరం ఉంది" అంటూ లెటర్ రిలీజ్ చేశారు.
కాగా, మదగజరాజ మూవీ 2013లో షూటింగ్ కంప్లీట్ చేసుకొగా.. 12 ఏళ్ల అనంతరం ఇప్పుడు రిలీజ్ అవుతోంది. హీరో విశాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆయన తన డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన మనిషి. అలాగే తన పొలిటికల్, సినీ స్టాండ్స్‌తో ఇండస్ట్రీలో ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నారు. జెట్ స్పీడ్ లో సినిమాలు తీస్తూ నిర్మాతలు హాట్ ఫెవరెట్ హీరోగా నిలుస్తూ వస్తున్నారు.