Vijay Sethupathi: ట్రెండ్ సెట్ చేస్తున్న మక్కల్ 'సెల్వన్'

ABN , Publish Date - Jan 16 , 2025 | 09:35 PM

Vijay Sethupathi: 'బోల్డ్ కన్నన్'గా సాంప్రదాయ తమిళ దుస్తులు ధరించి, మలేషియాలోని విమానాశ్రయంలో డైనమిక్ గా నడుస్తూ, హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలలో పాల్గొంటూ, ఫెస్టివల్ లో డ్యాన్స్ చేస్తూ కనిపించడం..

Vijay sethupathi poster from ACE film

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి లీడ్ రోల్ నటిస్తున్న 'ACE' స్పెషల్ గ్లింప్స్ విడుదలైంది. అరుముగకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, యోగి బాబు, బి.ఎస్. అవినాష్, దివ్య పిళ్లై, బబ్లు, రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.

కరణ్ భగత్ రౌత్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ, జస్టిన్ ప్రభాకరన్ పవర్ ఫుల్ మ్యూజిక్ తో 'ACE' గ్రేట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని హామీ ఇచ్చింది. ఎడిటింగ్‌ను ఫెన్నీ ఆలివర్, ఆర్ట్ డైరెక్టర్ ఎ.కె. ముత్తు నిర్వహిస్తున్నారు. 7CS ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అరుముగకుమార్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.


సినిమా టైటిల్ టీజర్ విడుదలైన వెంటనే సంచలనం సృష్టించింది, మిలియన్ల వ్యూస్ సంపాదించి రికార్డులు సృష్టించింది. ఇప్పుడు, విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా, టీం ఈ ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసింది, ఇది అభిమానులలో మరింత ఉత్సాహాన్ని పెంచుతుంది.

ACE-VJS-INTRO-ANNOUNCEMENT-OUTNOW-POSTER-01 (1).jpg

ఈ గ్లింప్స్‌లో విజయ్ సేతుపతి 'బోల్డ్ కన్నన్'గా సాంప్రదాయ తమిళ దుస్తులు ధరించి, మలేషియాలోని విమానాశ్రయంలో డైనమిక్ గా నడుస్తూ, హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలలో పాల్గొంటూ, ఫెస్టివల్ లో డ్యాన్స్ చేస్తూ కనిపించడం అలరించింది. ఈ విజువల్స్ ఎంటర్ టైన్మెంట్, యాక్షన్ తో కూడిన సినిమాను సూచిస్తాయి, అభిమానులు విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

విజయ్ సేతుపతి 'బోల్డ్ కన్నన్' పాత్రను పోషించడం ఆసక్తిని రేకెత్తించింది, తన విలక్షణమైన నటనా ప్రతిభకు పేరుగాంచిన విజయ్ సేతుపతి భారతీయ ప్రేక్షకుల హృదయాలను దోచుకోవడమే కాకుండా చైనాలో కూడా అంతకు మించి భారీ అభిమానులను సంపాదించుకున్నారు.

Also Read:Saif Ali Khan: కమ్యూనిటీ దొంగేనా.. ఆ సమయంలో కరీనా ఎక్కడుంది

Also Read:Saif Ali Khan knife attack : సైఫ్‌ హెల్త్‌ అప్‌డేట్‌ ఇదే..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 16 , 2025 | 09:55 PM