Oscars 2024: ఆస్కార్ బరిలో 'కంగువ'.. ఎందుకంటే

ABN , Publish Date - Jan 07 , 2025 | 01:35 PM

Oscars 2024: యుద్ధాలు జరుగుతుంటాయి... రక్తం ఏరులై పారుతుంది. శవాలు కుప్పలుగా పేరుకుపోతాయి. కానీ ఏ సన్నివేశం మనసును తాకేలా ఉండదు. ప్రేక్షకుడు పాత్రలో లీనమయ్యే క్యారెక్టర్‌ ఒకటీ కనిపించదు. ఎప్పటిదో పాంటసీ కథకి, వర్తమాన కాలానికి ముడిపెడుతూ తెరకెక్కించారు.

suriya's kanguva in oscars

ప్రస్తుతం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోన్న విషయం 2024లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచినా సూర్య కంగువ సినిమా ఆస్కార్స్ బరిలో నిలవడం. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ సినిమాని యూనానిమస్ గా రిజెక్ట్ చేశారు. అయినా భారత్ నుండి Oscars 2024 బరిలో నిలిచి షార్ట్ లిస్ట్ అయ్యింది. మరోవైపు థియేటర్, ఓటీటీలలో ప్రతి ఒక్కరి మన్ననలు పొందిన కిరణ్ రావు ‘లాపతా లేడీస్’ రిజెక్ట్ అయినా విషయం తెలిసిందే. కాగా, కంగువ షార్ట్ లిస్ట్ కావడానికి ప్రధాన కారణాలు ఏంటంటే..


Oscars 2024 బెస్ట్ పిక్చర్ కోసం మొత్తం 323 సినిమాలు పోటీపడగా ఎలిజిబుల్ లిస్ట్ లో 'కంగువ' చోటు దక్కించుకుంది. ఇక ఈ సినిమా కథనం స్లో గా ఉన్నా.. సినిమాలోని అటవీ ప్రపంచం, అందులో నివసించే తెగ నేపథ్యం, విజువల్ ఎఫెక్ట్స్ ని పరిశీలించి షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Untitled-2 copy.jpg


ఈ సినిమా కథ విషయానికొస్తే.. కొన్ని వందల ఏళ్ళ క్రితం సముద్రాన్ని ఆనుకొని ప్రణవ కోన, రుధిర కోన, కపాల కోన, హిమ కోన, చీకటి కోన అని ఐదు ప్రాంతాలు ఉన్నాయి. ఒక్కో కోనకు ఒక్కో పాలకుడు ఉంటాడు. ప్రణవ కోనకి కంగువా (సూర్య) పాలకుడు. చాలా గొప్ప వీరుడు. కపాల కోనకు ఉధిరన్‌ (బాబీడియోల్‌) పాలకుడు. సముద్రం మీదుగా ఆ ప్రాంతానికి వచ్చిన రోమన్‌ చక్రవర్తి ప్రణవ కోనను తన వశం చేసుకోవాలనుకుంటాడు. ఐదు కోనల మధ్య అంతర్‌ యుద్దం వచ్చేలా ప్రణాళిక రచిస్తాడు. ఇందులో ప్రణవ కోన, హిమ కోన ఒక పక్షం. మిగిలిన మూడు కోనలు మరో పక్షం. అయితే యుద్థం సమీపంలో ఉండగా పలోమా అనే ఓ చిన్నపిల్లాడి కోసం.. ప్రణవ కోనని వదిలి చీకటి కోన అనే చోటుకి వెళ్లిపోతాడు కంగువా. ఇంతకీ ఈ పలోమా ఎవరు? అతని కోసం కంగువా ఎందుకు రాజ్యాన్ని విడిచాడు? మొత్తం ప్రణవ కోన జాతిని అంతం చేయడానికి వచ్చిన కపాల కోన నాయకుడు బాబీ డియోల్‌ లక్ష్యం నెరవేరిందా? తమ జాతిని రక్షించడానికి కంగువా రణ రంగంలో దిగాడా లేదా? ఇది ఒక కథ.

అయితే.. ఫ్రాన్సిస్‌ (సూర్య) గోవాలో ఓ బౌంటీ హంటర్‌. పోలీసులు కూడా చేయలేని పనులు చేసే క్రమంలో జీటా అనే బాలుడిని కలుసుకుంటాడు. ఫ్రాన్సిస్‌, జీటా కలుసుకోగానే ఇద్దరికీ ఏదో తెలియని సంబంధం ఉన్న ఫీలింగ్‌ కలుగుతుంది. జీటా సమస్యలో ఉన్నాడని తెలుసుకున్న అతను జీటాని కాపాడేందుకు ప్రయత్నం చేస్తాడు. అసలు జీటాని వెంటాడుతున్నది ఎవరు? ఫ్రాన్సిస్‌, జీటా, 1070 సంవత్సరాల నాటి ప్రణవకోన యువరాజు కంగువా (సూర్య)కి మధ్య సంబంధం ఏమిటి? అన్నది సినిమా నేపథ్యం

Updated Date - Jan 07 , 2025 | 01:40 PM