Director Shankar: రజనీకాంత్ బయోపిక్‌ తీయాలని వుందన్న శంకర్‌పై ఫ్యాన్స్ ఫైర్.. ఎందుకంటే?

ABN , Publish Date - Jan 14 , 2025 | 05:34 PM

‘గేమ్ చేంజర్’ మూవీ ప్రమోషన్స్‌లో దర్శకుడు శంకర్ మాట్లాడిన మాటలపై సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంతకీ శంకర్ ఏమన్నారు? ఫ్యాన్స్ ఎందుకు ఫైర్ అవుతున్నారు? తెలియాలంటే.. పూర్తిగా ఈ వార్త చదవాల్సిందే. అసలు విషయం ఏమిటంటే..

Rajinikanth and Director Shankar

దక్షిణ భారత చిత్రపరిశ్రమలో అగ్ర హీరో సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Super Star Rajinikanth), అగ్ర దర్శకుడు శంకర్‌ (Director Shankar) కాంబినేషన్‌లో వచ్చిన ‘యందిరన్‌’, ‘శివాజీ’, ‘2.0’ చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఇపుడు రజనీకాంత్‌ ‘కూలీ’ సినిమాలో నటిస్తుండగా, శంకర్‌ దర్శకత్వం వహించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ శుక్రవారం పాన్‌ ఇండియా మూవీగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ నేపథ్యంలో శంకర్‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రజనీకాంత్‌ బయోపిక్‌ తీయాలని ఉందని వెల్లడించినట్లుగా తెలుస్తోంది.


‘గేమ్ చేంజర్’ మూవీ ప్రమోషన్స్ సమయంలో శంకర్‌కు ఎవరి బయోపిక్ అయినా తీసే ఆలోచన ఉందా? అనే ప్రశ్న ఎదురవగా.. ‘‘నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి ఆలోచన నాలో కలగలేదు. ఇలాంటి ప్రచారం జరిగేవరకు నా మదిలో ఈ ఆలోచన తట్టలేదు. ప్రతి ఒక్కరికీ రజనీ గురించి బాగా తెలుసు. ఒక్క క్షణం కూడా అలాంటి ఆలోచన చేయలేదు. కానీ మీడియా ప్రశ్నించగానే ఈ ఐడియా వచ్చింది. ఒకవేళ బయోపిక్‌ మూవీ తీస్తే మాత్రం రజనీకాంత్‌ బయోపిక్‌ను తీయాలన్నది నా కోరిక’’ అని వివరించారు. అయితే శంకర్ వ్యాఖ్యలపై తమిళ తంబీలు తీవ్రంగా మండిపడుతున్నారు.

Also Read-Sankranthiki Vasthunnam Review: వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఎలా ఉందంటే


అందుకు కారణం, ‘2.0’ సమయంలో రజనీకాంత్‌ని శంకర్ చాలా చులకనగా చూశారనే టాక్ వినబడింది. అందుకే ‘గేమ్ చేంజర్’ మూవీపై తమిళనాట రజనీ ఫ్యాన్స్ కావాలని మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. శంకర్ పేరు వింటే చాలా వారు ఆగ్రహానికి గురవుతున్నారు. మరి అంతలా రజనీకాంత్‌ని శంకర్ ఏం అవమానించాడో తెలియదు కానీ.. రజనీ బయోపిక్ మాత్రం శంకర్ తీయడానికి వీల్లేదు అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. చూద్దాం మరి భవిష్యత్‌లో ఏం జరుగుతుందో..


Shankar.jpg

Also Read: Hari Hara Veeramallu: పవన్ 'మాట వినాలి' లేకపోతే ఏమవుతుందో తెలుసా..

Also Read: Daaku Maharaaj Review: బాలయ్య నటించిన మాస్ మసాలా మూవీ ‘డాకు మహారాజ్’ ఎలా ఉందంటే

Also Read:Game Changer Review: ‘గేమ్ చేంజర్’ మూవీ రివ్యూ

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 14 , 2025 | 05:45 PM