Raghava Lawrence Kanchana 4: ‘కాంచన 4’.. కత్తిలాంటి ఫిగర్‌ని పట్టిన లారెన్స్

ABN , Publish Date - Jan 30 , 2025 | 10:12 AM

‘చంద్రముఖి’లా సౌత్ సినీ ఇండస్ట్రీకి ఇంకో దెయ్యం ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు ‘కాంచన’. ఈ ‘కాంచన’ సిరీస్ చిత్రాలతో రాఘవ లారెన్స్ అంతగా జనాలను భయపెట్టేశారు. ఈ ఫ్రాంచైజ్‌లో ఇప్పుడు నాల్గవ సినిమా ‘కాంచన 4’ వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం లారెన్స్ భయంతో పాటు గ్లామర్ ట్రీట్ కూడా ఇవ్వడానికి క్యాస్టింగ్‌ను ఎంపిక చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Raghava Lawrence

ప్రముఖ నృత్య దర్శకుడు, సినీ నిర్మాత, దర్శక హీరో రాఘవ లారెన్స్‌ నిర్మించే ‘కాంచన-4’ కోసం ఓ కత్తిలాంటి ఫిగర్‌ని ఎంపిక చేసినట్లుగా కోలీవుడ్‌లో టాక్ నడుస్తుంది. ‘ముని’ సిరీస్‌తో ‘కాంచన’ సినిమాలను ప్రారంభించిన లారెన్స్ ఇప్పటి వరకు మూడు సినిమాలను రూపొందించారు. మూడు సినిమాలు కూడా ఒకదానిని మించి మరొకటి హిట్టయ్యాయి. ‘చంద్రముఖి’లా ‘కాంచన’ కూడా ఓ దెయ్యంలా ఇండస్ట్రీలో ముద్రపడిపోయింది. ఇప్పుడా పేరుతో మరింత క్యాష్ చేసుకునేందుకు దర్శకుడు రాఘవ లారెన్స్ రెడీ అవుతున్నారు. త్వరలోనే ఆయన ‘కాంచన 4’కి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రస్తుతం ‘కాంచన 4’కి సంబంధించి క్యాస్టింగ్ ఎంపిక జరుగుతున్నట్లుగా సమాచారం.


Also Read- Chandini Tamilarasan: ‘నో’ చెబితే టచ్‌ చేసే సాహసం చేయరు

ఈ నేపథ్యంలో ‘కాంచన 4’కి మరింత గ్లామర్ అద్దేందుకు బాలీవుడ్‌ హీరోయిన్‌ నోరా ఫతేహిని లారెన్స్ ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. తాను హీరోగా నటిస్తున్న ‘బెంజ్‌’’ చిత్రీకరణ ఆలస్యం కావడంతో తన స్వీయ నిర్మాణంలో తెరకెక్కించే ‘కాంచన-4’పై ఆయన దృష్టి సారించారు. ఇందులో హీరోయిన్‌గా ఇప్పటికే పూజా హెగ్డేను ఎంపిక చేయగా, తాజాగా నోరా ఫతేహితో డీల్‌ కుదుర్చుకుని.. మరింత గ్లామర్ డోస్ ఇచ్చేందుకు లారెన్స్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.


Nora-Fatehi.jpg

Also Read- Pushpa 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘పుష్ప 2 రీ లోడెడ్’.. నీ యవ్వ ఇక తగ్గేదే లే..

‘కాంచన’ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన చిత్రాలను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ నాలుగో భాగాన్ని ఏమాత్రం కాంప్రమైజ్‌ కాకుండా రూపొందించాలని లారెన్స్‌ సన్నాహాలు చేశారు. గోల్డ్‌ మైన్స్‌ పతాకంపై నిర్మించే ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి వినోదాత్మకంగా తెరకెక్కించనున్నారు. ఈ యేడాది ఆఖరులో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా నిర్మాతలు సన్నాహాలు చేపడుతున్నారు. ప్రస్తుతం క్యాస్టింగ్ ఎంపిక ఫుల్ స్వింగ్‌లో ఉందని, అతి త్వరలో మూవీని లాంచ్ చేయనున్నారనేలా కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.


Also Read- Rakhi Sawant Marriage: మూడో పెళ్లికి ఫైర్ బ్రాండ్ రెడీ.. టార్గెట్ పాకిస్తాన్!

Also Read- Fatima Sana Shaikh: ఓ తెలుగు నిర్మాత పచ్చిగా అడిగాడు.. ‘దంగల్’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

Also Read- సచిన్ కుమార్తె.. సామాన్యమైనది కాదండోయ్!

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 30 , 2025 | 10:12 AM