ప్రముఖ దర్శక నిర్మాత ఆకస్మిక మృతి

ABN , Publish Date - Jan 19 , 2025 | 10:46 AM

ప్రముఖ దర్శక నిర్మాత గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. 1995లో మన్సూర్‌ అలీఖాన్‌ హీరోగా ‘సింధుబాద్‌’ని తెరకెక్కించారు. ఆ తర్వాత పాండ్యరాజన్‌ - కనక జంటగా నటించిన ‘పురుషన్‌ ఎనక్కు అరసన్‌’ అనే మూవీని నిర్మించారు. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో ఆయన మరెన్నో సినిమాలను తెరకెక్కించారు. ఇంతకీ ఆ దర్శకనిర్మాత ఎవరంటే..

Jayamurugan

ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత జయమురుగన్‌ ఆకస్మికంగా మృతి చెందారు. శుక్రవారం రాత్రి గుండెపోటుకు గురైన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1995లో మన్సూర్‌ అలీఖాన్‌ హీరోగా ‘సింధుబాద్‌’ని తెరకెక్కించారు. ఆ తర్వాత పాండ్యరాజన్‌ - కనక జంటగా నటించిన ‘పురుషన్‌ ఎనక్కు అరసన్‌’ అనే మూవీని నిర్మించారు. ఈ చిత్రాల విజయంతో ‘రోజామలరే’, ‘అడడా ఎన్న అళగు’, ‘తీ ఇవన్‌’ వంటి చిత్రాలను స్వీయనిర్మాణ దర్శకత్వంలో రూపొందించారు. ఒక వైపు నిర్మాతగా, మరోవైపు దర్శకుడుగా రాణిస్తూ వచ్చిన జయమురుగన్‌.. తన కుటుంబ సభ్యులతో తిరుపూరులో నివసిస్తున్నారు.


Also Read-Ram Charan: రామ్ చరణ్.. తండ్రికి తగ్గ తనయుడు.. కాదు కాదు అంతకుమించి!

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఆయనకు ఉన్నట్టుండి గుండె నొప్పి రావడంతో తిరుపూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. శనివారం అంత్యక్రియలు పూర్తి చేశారు. జయమురుగన్‌ ఆకస్మిక మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్ర్భాంతితో పాటు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మనిదన్‌ సినీ ఆర్ట్స్‌ పేరుతో సినిమాలను నిర్మించిన జయమురుగన్‌, కొన్ని సినిమాలకు సంగీత దర్శకుడిగా కూడా పనిచేయడం విశేషం. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన జయమురుగన్ మృతి ఇండస్ట్రీకి తీరని లోటని పలువురు సినీ ప్రముఖులు ఆయన గురించి తెలుపుతూ.. దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరుతూ.. జయమురుగన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని చెప్పుకొచ్చారు.

Also Read-Manchu Manoj: నా పోరాటం ఎందుకంటే.. ఓహో ఇదన్నమాట అసలు విషయం!


Also Read-Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌కు సారీ చెప్పిన బాలయ్య ‘డాకు’ బ్యూటీ.. మ్యాటరిదే!

Also Read-Madhavi Latha: ఈ రోజుల్లో పతివ్రతలు ఎవరు లేరమ్మా.. మాధవీ లత షాకింగ్ కామెంట్స్

Also Read:Manchu Manoj: సింగిల్‌గా వస్తా.. ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 19 , 2025 | 12:16 PM