Kollywood: రెండు సినిమాలకు ఒకే టైటిల్.. టచ్ చెయ్యొదంటున్న బడా కంపెనీ
ABN , Publish Date - Jan 29 , 2025 | 08:03 PM
Kollywood: ప్రస్తుతం కోలీవుడ్ లో వింత పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు స్టార్ హీరోలకు ఫిల్మ్ ఛాంబర్ ఒకటే టైటిల్ ని కేటాయించడం వివాదాస్పదమైంది. అదే టైటిల్ పోస్టర్ లను ఇద్దరు ఒకే రోజు రిలీజ్ చేయడమే ఉత్కంఠను రేపితే మరో దిగ్గజ సంస్థ మధ్యలో దూరింది. దీంతో తీవ్ర అయోమయం ఏర్పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
తాజాగా శివకార్తికేయన్ 'పరాశక్తి' సినిమా టీజర్ రిలీజ్ అయ్యి అందరి దృష్టిని ఆకర్షించింది. తమిళనాడు మినహా ఇతర రాష్ట్రాల ప్రజలకు పీరియాడికల్ యాక్షన్ సీక్వెన్స్, శ్రీలీల అభినయం, సుధ కొంగర డైరెక్షన్ దృష్టిలో పడితే. తమిళనాడు ప్రజలకు మాత్రం టైటిల్ నజర్ లో పడింది. ఎందుకంటే ఈ సినిమా టైటిల్ ని బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీకి కూడా ఫిల్మ్ ఛాంబర్ కేటాయించింది. ఒక సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయగానే మరో సినిమా యూనిట్ కూడా వెంటనే సినిమా టీజర్ ని రిలీజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఎలాంటి వివాదం ఏర్పడనుండో అని ఆసక్తి నెలకొంది. ఎవరు వెనక్కి తగ్గకుంటే మాత్రం విజయ్ ఆంటోనీ 'పరాశక్తి' మొదటగా సమ్మర్ లో రిలీజ్ కానుంది. దీంతో ఈ ఎఫెక్ట్ అంతా శివకార్తికేయన్ సినిమాపై పడనుంది.
ఇది ఇలా ఉండగా తమిళ ప్రజలకు 'పరాశక్తి' వేరీ స్పెషల్. ఎందుకంటే ఇది 1952లో దిగ్గజ నిర్మాణ సంస్థ AVM నిర్మించిన కల్ట్ సినిమా. తెలుగు ప్రేక్షకులకు 'మాయాబజార్', హిందీ ప్రేక్షకులకు 'షోలే' ఎలాగో తమిళ ప్రేక్షకులకు 'పరాశక్తి' అలాగే. ఈ నేపథ్యంలోనే నిర్మాణ సంస్థ AVM.. ఈ టైటిల్ ని ఎవరు వాడుకోవద్దని విజ్ఞప్తి చేసింది. 1952లో వచ్చినా 'పరాశక్తి' కల్ట్ గా ప్రేక్షకుల మదిలో నిలవాలంటే.. ఈ టైటిల్ ని ఎవ్వరు వాడుకోవద్దని డిమాండ్ చేసింది. కానీ.. ఆ సంస్థకు లీగల్ గా ఎలాంటి రైట్స్ లేవు . దీంతో ఈ ఎపిసోడ్ దేనికి దారితీస్తోందని సర్వత్రా ఆసక్తి నెలకొంది.