Hero Karthi: నో డౌట్.. ‘తండేల్’ తమిళ్‌లో పెద్ద హిట్..
ABN , Publish Date - Jan 31 , 2025 | 10:13 AM
‘తండేల్’ మూవీ పెద్ద హిట్టవుతుందని నమ్మకంగా చెప్పారు కోలీవుడ్ స్టార్ హీరో కార్తి. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 7 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ చిత్ర తమిళ ట్రైలర్‌ని తాజాగా చెన్నైలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హీరో కార్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘తండేల్’ మూవీ టీమ్‌కు ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు.
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ‘కార్తికేయ-2’ వంటి బంపర్ హిట్ తర్వాత డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోన్న ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. గురువారం ఈ మూవీ తమిళ ట్రైలర్‌ను చెన్నైలో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో కార్తి ముఖ్య అతిథిగా హాజరై.. తమిళ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంంలో డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్, డైరెక్టర్ వెంకట్ ప్రభు వంటి వారు అతిథులుగా హాజరవగా.. తమిళ్‌లో ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.
Also Read- Kiss Scene: ఆ ముద్దు సీన్ ట్రిమ్ చేశారు.. పాపం పూజా హెగ్డే?
ట్రైలర్ విడుదల అనంతరం హీరో కార్తి మాట్లాడుతూ.. ‘‘నన్ను టాలీవుడ్‌లో ఎంతో గొప్పగా ఆదరించారు. తెలుగు ప్రేక్షకుల గొప్ప ప్రేమ నాకు దొరికింది. ‘తండేల్’ మూవీ 2018లో జరిగిన రియల్ స్టోరీ అని తెలిసి ఆశ్చర్యపోయాను. మన జాలర్లు పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడి వారికి దొరికిపోవటం, అక్కడి నుంచి తప్పించుకుని రావటం లాంటి డ్రామాతో పాటు చక్కటి ప్రేమ కథతో ఈ మూవీని తెరకెక్కించారు. 20 మంది దగ్గర రైట్స్ తీసుకుని, మూడేళ్లు స్క్రిప్ట్ తయారు చేసి, ఏడాదిన్నర పాటు షూటింగ్ చేశారంటే ఆ సినిమా అంటే వాళ్లకెంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. దర్శకుడు చందూ మొండేటి కెరీర్‌లో చాలా హిట్ మూవీస్ చేశారు. ఈ సినిమా కూడా ఆయన హిట్ మూవీస్‌లో ఒకటిగా నిలుస్తుందని నమ్ముతున్నాను.
Also Read- Chandini Tamilarasan: ‘నో’ చెబితే టచ్ చేసే సాహసం చేయరు
అల్లు అరవింద్‌గారు చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్నారంటే అది మామూలు విషయం కాదు. ఇలా ఉండాలంటే.. కేవలం బిజినెస్ మాత్రమే కాదు, సినిమాపై ప్యాషన్ కూడా ఉండాలి. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి. ‘తండేల్’ చాలా పెద్ద సక్సెస్‌ను సాధించాలి. ఈ సినిమాలో నటించిన కరుణాకరన్ తెలుగులోనూ గొప్ప పేరు తెచ్చుకోవాలి. ఒక చిన్న సన్నివేశంతో నటుడిగా తన టాలెంట్‌ను చూపించే కొద్ది మంది నటుల్లో ఆయన ఒకరు. దేవిశ్రీ గొప్ప నిత్యం ఎంతో కష్టపడుతుంటాడు. తనకు అభినందనలు. సాయిపల్లవి ప్రతీ పాత్రను అద్భుతంగా చేస్తుంది. ప్రతీ ఎమోషన్‌ను చక్కగా పలికిస్తుంది. అందుకే అందరికీ తను ఎంతగానో నచ్చుతుంది.
Also Read- Kollywood Directors: కోలీవుడ్ డైరెక్టర్లు.. భయపడుతున్న టాలీవుడ్ హీరోలు!
ఎ.ఎన్.ఆర్‌గారు, నాగార్జునగారితో ఇక్కడి వారికి మంచి అనుబంధం ఉంది. నేను నాగార్జునగారితో కలిసి పని చేశాను కూడా. అక్కినేని ఫ్యామిలీతో నాకు మంచి అనుబంధం ఉంది. నాగ చైతన్య ఇన్నోసెన్స్‌లా కనిపించే గ్రేట్ యాక్టర్. తనపై ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. ‘తండేల్’ కోసం ఎంతో కష్టపడ్డారని తెలిసింది. ఫిబ్రవరి 7న వస్తున్న ఈ సినిమా తమిళంలో పెద్ద హిట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. ఈ సినిమాను తమిళ్‌లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రభుకి అభినందనలు’’ అని తెలిపారు.