Nayanthara: నయనతారకు డబుల్ షాక్..
ABN , Publish Date - Jan 06 , 2025 | 05:48 PM
Nayanthara: ఇప్పటికే ధనుష్ ప్రొడ్యూస్ చేసిన ‘నేనూ రౌడీనే’ సినిమాలో పర్మిషన్ లేకుండా మూడు సెకండ్ల క్లిప్పింగ్‌ను వాడుకున్నారంటూ ధనుష్ రూ.10 కోట్లకు దావా వేశారు. ఈ నేపథ్యంలోనే మరో చిత్ర నిర్మాతలు నయన్‌పై దావా వేశారు.
సౌతిండియన్ లేడి సూపర్ స్టార్ నయనతారకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గతేడాది నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ చేసిన తన స్వీయ డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond The Fairy Tale)పై తన సినిమాలో సన్నివేశాలు వాడుకున్నారని హీరో, ప్రొడ్యూసర్ ధనుష్ రూ. 10 కోట్ల దావా వేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కోర్టు కూడా ధనుష్‌కే అనుకూలంగా తీర్పునిచ్చింది. కాగా, ఈ కేసు ఇంకా కోర్టులోనే ఉంది. ఈ నేపథ్యంలోనే మరో చిత్ర నిర్మాతలు నయన్‌పై దావా వేశారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఆమె నటించిన 'చంద్రముఖి' మూవీ నిర్మాతలు ఆమెకు నోటీసులు పంపించారు. నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో పర్మిషన్ లేకుండానే మూవీ క్లిప్స్ వాడుకున్నారని నయన్ తో పాటు నెట్‌ఫ్లిక్స్ కి నోటీసులు పంపించారు. రూ. 5 కోట్ల పరిహారం డిమాండ్ చేశారు. వీటిపై నయనతార, నెట్‌ఫ్లిక్స్ ఇంకా స్పందించలేదు.
ఇప్పటికే ధనుష్ ప్రొడ్యూస్ చేసిన ‘నేనూ రౌడీనే’ సినిమాలో పర్మిషన్ లేకుండా మూడు సెకండ్ల క్లిప్పింగ్‌ను వాడుకున్నారంటూ ధనుష్ రూ.10 కోట్లకు దావా వేశారు. ఈ సినిమాని నయనతార భర్త విగ్నేష్ శశివన్ తెరకెక్కించారు. విజయ్ సేతుపతి హీరోగా నటించగా నయన్ హీరోయిన్ రోల్ చేసింది. ఈ సినిమా ద్వారానే దర్శకుడు విగ్నేష్ శివన్ తో ఆమె ప్రేమలో పడింది. అనంతరం వీరిరువురు పెళ్లి చేసుకున్నారు. అలాగే వీరి పెళ్లి వీడియోని డాక్యుమెంటరీగా రూపొందించి నెట్‌ఫ్లిక్స్ లో విడుదల చేశారు. అయితే వీరిద్దరికి ఎంతో స్పెషల్ అయినా ‘నేనూ రౌడీనే’ సినిమాలోని క్లిపింగ్స్ వాడుకోవడానికి నిర్మాత ధనుష్ ని పర్మిషన్ అడిగితే ఆయన నిరాకరించాడు. దీంతో నయన్ సినిమా 'బిహేండ్ ది సీన్స్'(BTS)ని వాడుకుంది. అయినా ధనుష్ కోర్టులో కేసు వేశారు.