Bad Girl: సమాజంలో కులం ఉంది కాబట్టే సినిమాల్లో కులం

ABN , Publish Date - Jan 30 , 2025 | 05:27 PM

Bad Girl: "మనం కులాలు లేని సమాజంలో జీవించడం లేదు. మనం ఎక్కడో ఒక పాత్రను ఎదో ఒక కులానికి అనుబంధించాల్సిందే. అలాగే, నాకు బాగా తెలిసిన సొసైటీ నుండే నా పాత్రను రూట్ ఎంచుకున్నాను. కులం లేదని చెప్పడం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది"

Bad Giral Teaser Controversy

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు క్యాస్ట్(కులం)పై సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇవి చాలా కాంట్రవర్సీలను క్రియేట్ చేసిన బ్లాక్‌బస్టర్‌లుగానే నిలిచాయి. ఇక ఇతర ఇండస్ట్రీల అభిమానులు తమిళ సినిమాల్లో ఎక్కువగా క్యాస్ట్ గురించి సినిమాలు రావడంపై తీవ్ర అసహనం తెలుపుతుంటారు. ఈరోజుల్లో ఇంకా క్యాస్ట్ ఎక్కడుంది అంటూ విమర్శలు చేస్తుంటారు. ప్రధానంగా వెట్రి మారన్, పా. రంజిత్, మారి సెల్వరాజ్ వంటి దర్శకులు క్యాస్ట్ బేస్డ్‌గా అనేక సినిమాలు తెరకెక్కించారు. తాజాగా బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, వెట్రి మారన్ నిర్మాతలుగా మారి తెరెకెక్కిస్తున్న చిత్రం 'బ్యాడ్ గర్ల్'. ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజై పెద్ద రచ్చ చేసింది. ఈ నేపథ్యంలోనే విమర్శలకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు ఈ సినిమా డైరెక్టర్ వర్ష భరత్.


ఈ సినిమాలో అంజలి శివరామన్ ఒక బ్రాహ్మణ కుటుంబలో పుట్టిన అమ్మాయిగా చూపించారు. అయితే ఈ సినిమాలో ఆమెకు ఉన్నా వ్యసనాలు, చెడ్డ అలవాట్లు సదరు కులపు ప్రజల్లో అగ్రహావేశానికి కారణమయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. ఈ చర్చలో భాగంగా కొందరు మాట్లాడుతూ.. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సినిమాలు విడుదలైనప్పుడు ఇలాంటి విమర్శలు ఎందుకు చేయలేదని విమర్శిస్తున్నారు. ప్రముఖ నటుడు ధనుష్, దర్శకుడు పా రంజిత్ లాంటి వారు చిత్ర బృందానికి మద్దతు తెలుపుతున్నారు. కాగా మరోవైపు నుండి కూడా విమర్శలు రావడంతో దర్శకుడు భరత్ వర్ష రంగంలోకి దిగి సమాధానం చెప్పాడు.


తాజాగా ఆయన మాట్లాడుతూ.. "మనం కులాలు లేని సమాజంలో జీవించడం లేదు. మనం ఎక్కడో ఒక పాత్రను ఎదో ఒక కులానికి అనుబంధించాల్సిందే. అలాగే, నాకు బాగా తెలిసిన సొసైటీ నుండే నా పాత్రను రూట్ ఎంచుకున్నాను. కులం లేదని చెప్పడం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది" అంటూ సమాధానమిచ్చారు. భరత్ వర్షకు మద్దతు తెలుపుతూ కొందరు మాట్లాడుతూ.. " మీరు ఎప్పుడో జరిగిన కుల వివక్ష గురించి ఇంకా ఎన్ని రోజులు సినిమాలు తీస్తారు అంటూ విమర్శిస్తున్నారు కదా! అయితే కులం వివక్ష ఒక 100 ఏళ్ల పూర్వం వరకే ఉంది అనుకుందాం. మరి కొన్ని వేల సంవత్సరాలు క్రితం భువిపై దేవతల ఉనికి గురించి ఇప్పటికి గొప్పగా సినిమాలు ఎందుకు తీస్తున్నారు. వేల సంవత్సరాల కంటే వందల సంవత్సరాలే దగ్గర కదా? దేవుళ్ళ ఉనికి అనేది పురాణం, మరి మనుషులది చరిత్ర. కాబట్టి చరిత్ర తెలియని వాడు చరిత సృష్టించలేడు. కాబట్టి చరిత్ర తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఇలాంటి వాస్తవిక సినిమాల నుండే బయటకొస్తుందని" కామెంట్స్ చేస్తున్నారు.


అయితే ఈ సినిమాను జనవరి 31, 2025న రోటర్‌డ్యామ్‌లో జరగనున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈ చిత్రం ప్రీమియర్ ను ప్రదర్శించనున్నారు. కాగా థియేట్రికల్ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Also Read- Spirit: రెబల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్పిరిట్ షూటింగ్ అప్పుడే

Also Read- Kangana Ranaut: కాజోల్‌, దీపికా ముద్దు.. మేమంటే చేదు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 30 , 2025 | 05:32 PM