Aditi Shankar: నాన్న పెట్టిన నిబంధన మేరకే సినిమాలు చేస్తున్నా..
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:35 AM
సెలబ్రిటీ పిల్లలని గోల్డెన్ స్పూన్‌తో పోల్చుతూ ఉంటారు కానీ.. ఎవరైనా సరే ఇండస్ట్రీలో నిలబడాలంటే మాత్రం వారికి టాలెంటే ముఖ్యం. సెలబ్రిటీ ట్యాగ్ కేవలం ఒకటి రెండు సినిమాల వరకే వర్తిస్తుంది. ఆ తర్వాత కష్టమే ముందుకు తీసుకెళుతోంది. ఇప్పుడు శంకర్ కుమార్తె అదితి కూడా అదే చెబుతుంది. తన తండ్రి పేరు కాకుండా.. తనే స్వయంగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా అదితి తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
తన తండ్రి ఎస్. శంకర్ పేరు, ఇమేజ్‌ను ఉపయోగించుకుని సినిమా అవకాశాలు అడగడం లేదని హీరోయిన్ అదితి శంకర్ (Shankar Daughter Aditi Shankar) స్పష్టం చేశారు. డాక్టర్ కోర్సు పూర్తి చేసిన అదితి.. సినిమాలపై ఉన్న ఆసక్తితో హీరోయిన్‌గా అరంగేట్రం చేశారు. కార్తీ హీరోగా వచ్చిన ‘విరుమన్’ సినిమాలో తొలిసారి నటించారు. ఆ తర్వాత ‘మావీరన్’, ‘నేసిప్పాయ’ సినిమాల్లో నటించగా ప్రస్తుతం ‘వన్స్‌మోర్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ‘నేసిప్పాయ’ చిత్రం పాజిటివ్ టాక్‌తో మంచి సక్సెస్‌ను అందుకుంది. ఇప్పుడీ చిత్రం తెలుగులో ‘ప్రేమిస్తావా’ అనే టైటిల్‌తో విడుదలకాబోతోంది. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సంచలన కామెంట్స్ చేశారు.
Also Read- Chandini Tamilarasan: ‘నో’ చెబితే టచ్ చేసే సాహసం చేయరు
‘‘శంకర్ కుమార్తె కావడం గర్వంగానే ఉంది. కానీ, ఆయన పేరు చెప్పి సినిమా అవకాశాలు కోరడం ఇష్టంలేదు. అవకాశం వచ్చిన ప్రతి అడిషన్‌కు వెళ్తున్నాను. సినిమాల్లో సక్సెస్, ఫెయిల్యూర్ మన చేతుల్లో లేదు. వైద్య కోర్సు పూర్తి చేసిన వెంటనే సినిమాల్లోకి వెళతానని డాడీకి చెప్పాను. ఆయన సుధీర్ఘంగా ఆలోచన చేసి నిర్ణీత గడువులోగా సక్సెస్ కాకపోతే తిరిగి వైద్య వృత్తికి అంకితం కావాలని కండిషన్ పెట్టారు. ఆ నిబంధనకు అంగీకరించి ఇపుడు సినిమాల్లో నటిస్తున్నాను. డబ్బుకోసం సినిమాల్లో యాక్ట్ చేయడం లేదు. హిస్టరీ, పురాణకథల్లో నటించాలన్న కోరికవుంది. తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌లో హీరోగా చేస్తున్న చిత్రంలో నటిస్తున్నాను. తమిళంలో రజనీకాంత్, నిత్యా మేనన్, సాయి పల్లవి అంటే ఇష్టం. నా తండ్రి దర్శకత్వంలో నటించాలన్న కోరిక ఉంది. ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను’’ అని అదితి శంకర్ చెప్పుకొచ్చారు.
Also Read- Pushpa 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘పుష్ప 2 రీ లోడెడ్’.. నీ యవ్వ ఇక తగ్గేదే లే..
తాజాగా టాలీవుడ్‌లో జరిగిన ‘ప్రేమిస్తావా’ ట్రైలర్ లాంచ్ వేడుకలో మాట్లాడుతూ.. ‘ప్రేమిస్తావా’ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా ఫస్ట్ లవ్ స్టోరీ.. ఇందులో లవ్ ఉంది.. యాక్షన్ ఉంది.. రొమాన్స్ ఉంది. డైరెక్టర్ విష్ణు వర్ధన్ స్టైలిష్ మేకింగ్ ఉంది. ఈ సినిమాను అందరూ తప్పకుండా చూడండి. మా నాన్నగారిపై చూపిస్తున్న ప్రేమను నాపై కూడా చూపించాలని కోరుకుంటున్నానని తెలిపింది.