Suriya: రెండు సినిమాల్లోనూ డ్యూయెల్‌ రోల్‌..

ABN , Publish Date - Mar 09 , 2025 | 10:34 AM

తమిళ స్టార్‌ సూర్య చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. రెట్రో, సూర్య 45, వాడివాసల్‌ చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు. వీటిలో సూర్య వరుసగా ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్‌ నడుస్తోంది


తమిళ స్టార్‌ సూర్య (Suriya) చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. రెట్రో(Retro), సూర్య 45 (Suriya 45), వాడివాసల్‌ (vaadi Vasal) చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు. వీటిలో సూర్య వరుసగా ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్‌ నడుస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. త్రిష కథానాయిక. చిత్రీకరణ దశలో ఉన్న ఈ పాన్‌ ఇండియా చిత్రంలో సూర్య న్యాయవాదిగా, అయనార్‌గా రెండు పాత్రల్లో కనువిందు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అయనార్‌ పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతున్నట్లు కోలీవుడ్‌ మీడియా చెబుతోంది. ఇది ఆధ్యాత్మిక అంశాలతో నిండిన యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఇక ఈ సినిమా తర్వాత సూర్య చేయనున్న ‘వాడివాసల్‌’లోనూ.. ఆయన తండ్రీ-కొడుకుగా ద్విపాత్రాభినయంతో అలరించనున్నట్లు తెలుస్తోంది. దీనికి వెట్రిమారన్‌ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. గతేడాది కంగువా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు . శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పరాజయాన్ని చవిచూసింది.

Updated Date - Mar 09 , 2025 | 10:34 AM