Tom shine chacko: మరోసారి వార్తలో షైన్ టామ్ చాకో
ABN , Publish Date - Apr 24 , 2025 | 06:34 PM
మలయాళ నటుడు షైన్ టామ్ చాకోపై (Shine Tom Chacko) నటి విన్సీ సోనీ (Vincy sony) అలోషియస్ ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం గురించి జనాలు మరచిపోకముందే మరో మలయాళ నటి అతడిపై ఆరోపణలు చేశారు.
మలయాళ నటుడు షైన్ టామ్ చాకోపై (Shine Tom Chacko) నటి విన్సీ సోనీ (Vincy sony) అలోషియస్ ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం గురించి జనాలు మరచిపోకముందే మరో మలయాళ నటి అతడిపై ఆరోపణలు చేశారు. ‘సూత్రవాక్యం’ (Sukra vakyam) సెట్స్‌లో షైన్ టామ్ చాకో తనతో అనుచితంగా ప్రవర్తించాడని అపర్ణ జొన్స్ ఆరోపించారు. ప్రస్తుతం ఆస్ట్ర్టేలియాలో ఉన్న ఆమె మీడియాతో మాట్లాడారు.
‘‘చాకో ప్రవర్తన విషయంలో విన్సీ సోనీ చెప్పినవన్నీ 100 శాతం నిజాలే. అతడు సెట్‌లో ఎప్పుడూ ఒక తెల్లటి పొడిని తింటూ ఉండేవాడు. ఎటువంటి ఆధారాలు లేకుండా అది డ్రగ్ అని చెప్పలేను. ఎందుకంటే అది గ్లూకోజ్ కూడా కావొచ్చు. అయితే అతని ప్రవర్తన గురించి మాత్రం కచ్చితంగా చెప్పగలను. చాలా అస్ఘభ్యకరం గా ఉండేది. ఎప్పుడూ సెట్‌లో తిరుగుతూనే ఉంటాడు.. అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతుంటాడు. ఆ పరిసర ప్రాంతాల్లో హీరోయిన్స్ ఉంటే అతడి మాటలు మరింత అసభ్యంగా ఉండేవి. నాకు కూడా అతడి ప్రవర్తన అసౌకర్యం కలిగించింది. వెంటనే అక్కడి సిబ్బందికి చెప్పాను. దీంతో చిత్రబృందం అతడి షెడ్యూల్ కంటే ముందు నాది పూర్తిచేసింది’’ అని అపర్ణ అన్నారు. ‘సూత్రవాక్యం’ సినిమా సెట్‌లో షైన్ టామ్ చాకో తనతో అనుచితంగా ప్రవర్తించాడని నటి విన్సీ సోనీ కేరళ ఫిల్మ్ చాంబర్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై నటుడు ఆమెకు క్షమాపణలు చెప్పినట్లు కొన్ని కథనాలు వచ్చాయి. తాను ఉద్దేశపూర్వకంగా ఏదీ చేయలేదని, అయినా తన చర్యల వల్ల ఆమె ఇబ్బంది పడినందుకు సారీ చెప్పానని షైన్ తెలిపినట్టు మాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. కొచ్చిలో జరిగిన ‘ఇంటర్నల్ కమిటీ’ మీటింగ్‌లో.. ‘‘ఇకపై సెట్స్‌లో అందరితో మంచిగా ప్రవర్తిసా?్త’’ అని షైన్ మాటిచ్చారని ఓ మీడియా పేర్కొంది.