karthi 29: కార్తీ 29.. కథా నేపథ్యం ఏంటంటే..

ABN , Publish Date - Mar 24 , 2025 | 03:15 PM

తమిళ హీరో కార్తి (Karthi) కథల ఎంపిక డిఫరెంట్‌గా ఉంటుంది. సెలెక్టివ్‌గా సినిమాలు చేసే ఆయన యదార్ధ సంఘటనలు ఇతివృత్తంగా సినిమా చేయడానికి ముందుంటారు.

తమిళ హీరో కార్తి (Karthi) కథల ఎంపిక డిఫరెంట్‌గా ఉంటుంది. సెలెక్టివ్‌గా సినిమాలు చేసే ఆయన యదార్ధ సంఘటనలు ఇతివృత్తంగా సినిమా చేయడానికి ముందుంటారు. ఇప్పటికే యుగానికి ఒక్కడు, ఖాకీ, సర్దార్‌ లాంటి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలు చక్కని విజయం సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ తరహా కథతో (real Story for Karthi 29) కార్తీ మరో సినిమా చేయబోతున్నాడని తెలిసింది. ఒకప్పుడు రామేశ్వరం-శ్రీలంక ప్రాంతా మధ్య సముద్రపు దొంగల హవా నడిచేది. ఆ మార్గం కూడా ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు భయపడేవారని చెబుతుంటారు. ఇప్పుడా సంఘటన ఆధారంగా కార్తీ హీరోగా తమిళ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇది పూర్తిగా సీ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే చిత్రమని పోస్టర్‌ చూస్తే తెలుస్తోంది. ఇది కార్తీకి 29వ (karthi29) చిత్రం. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తుంది. 'ఖైదీ -2’తోపాటే ఈ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో వడివేలును ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారట. అలాగే హీరోయిన్‌గా కల్యాణీ ప్రియదర్శిని తీసుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. మే లేదా జూన్‌లో సినిమా షూటింగ్‌ మొదలుపెట్టడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

మరోవైపు కార్తీ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఖైదీ -2 త్వరలోనే సెట్స్‌ మీదకెళ్లనుంది. ఇటీవల కూలీ షూటింగ్‌ ముగించిన లోకేష్‌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఖైదీ -2 కూడా పట్టాలెక్కించాలని ప్లాన్‌ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రెండు సినిమాలకు డేట్లు సర్దుబాటు చేసి పూర్తి చేయాలన్నది కార్తీ ప్లాన్‌. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Updated Date - Mar 24 , 2025 | 03:15 PM