Rashmika Mandanna: రష్మిక ఈ విషయం మాకు తెలీదే.. నీది హైదరాబాదా.. 

ABN , Publish Date - Feb 15 , 2025 | 01:31 PM

‘ఛావా’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ఆ వ్యాఖ్యలకు కన్నడిగులు రష్మికపై మండిపడుతున్నారు.

పుష్ప (Pushpa) సినిమాతో నేషనల్‌ క్రష్‌ మార్క్‌ తెచ్చుకుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. 'పుష్ప-2'(Pushpa) తో పాన్‌ ఇండియా క్రేజ్‌ను దాటుకుపోయింది. ఇప్పుడు సౌత్‌తోపాటు నార్త్‌లోనూ హవా కొనసాగిస్తోంది. శుక్రవారం విడుదలైన ‘ఛావా’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ఆ వ్యాఖ్యలకు కన్నడిగులు రష్మికపై మండిపడుతున్నారు. (Rashmika Mandanna Faces Backlash)

‘‘నేను హైదరాబాద్‌ నుంచి వచ్చాను. ఇక్కడి ప్రేక్షకులు నాపై చూపిస్తోన్న ప్రేమాభిమానాలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది’’ అని ఆమె అనడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం కర్ణాటకలో దీనిపై చర్చ (Kannada Fans Fire) నడుస్తోంది.. ఆమె వ్యాఖ్యలను పలువురు కన్నడ వాసులు తప్పుపడుతున్నారు. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 


Rashmika.jpg

'‘విరాజ్‌పేట్‌  రష్మిక సొంతూరు. హైదరాబాద్‌కు ఎప్పుడు వచ్చింది? ఈ విషయం మాకు తెలియలేదు..!’, ‘వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు సొంతూరు గురించి చెప్పడానికి వచ్చిన సమస్య ఏమిటి?’ అంటూ పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గతంలో  కన్నడిగులు ఆమెపై మండిపడ్డ సందర్భాలున్నాయి. కర్ణాటక, కొడగు జిల్లా విరాజ్‌పేటకు చెందిన రష్మిక ‘కిరిక్‌ పార్టీ’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు రష్మిక. 'ఛలో’తో టాలీవుడ్‌కి పరిచయమైయ్యారు. ఇక్కడ వరుస విజయాలు అందుకున్న ఆమె స్టార్‌ హీరోయిన్‌గా జాబితాలో చేరిపోయింది. ఇప్పుడు అగ్ర హీరోల సరసన నటిస్తోంది. అంతే కాదు హిందీ పరిశ్రమలోనూ అవకాశాలు అందుకుంటోంది.

Updated Date - Feb 15 , 2025 | 01:31 PM