Prajwal Devaraj: వారం ఆలస్యంగా రాబోతున్న 'రాక్షస'
ABN , Publish Date - Feb 26 , 2025 | 07:04 PM
కన్నడ కథానాయకుడు ప్రజ్వల్ దేవ్ రాజ్ నటించిన చిత్రం 'రాక్షస'. ఫిబ్రవరి 28న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు కన్నడ, తెలుగు భాషల్లో మార్చి 7న జనం ముందుకు వస్తోంది.
ప్రజ్వల్ దేవరాజ్ (Prajwal Devaraj) హీరోగా నటించిన కన్నడ చిత్రం 'రాక్షస' (Rakshasa). లోహిత్ హెచ్ దర్శకత్వంలో టైమ్ లూప్ హారర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఫిబ్రవరి 28న ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగులోనూ విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే అనివార్యంగా ఈ మూవీ రిలీజ్ వారం వెనక్కి వెళ్ళింది. మార్చి 7న 'రాక్షస'ను రెండు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. గతంలో శివరాజ్ కుమార్ (Shivaraj Kumar) నటించిన 'వేద' (Veda) చిత్రాన్ని విడుదల చేసిన ఎంవీఆర్ కృష్ణ 'రాక్షస' ట్రైలర్ నచ్చి తెలుగు రైట్స్ ను దక్కించుకున్నారు. ఈ మూవీలో అరుణ్ రాథోడ్, శ్రీధర్, గౌతమ్, సోమశేఖర్, విహాన్ కృష్ణ తదితరులు ప్రధానపాత్రలు పోషించారు.