Prithviraj: ఫ్యాన్‌బాయ్‌ మూమెంట్‌ అంటూ పృథ్వీరాజ్‌ పోస్ట్‌

ABN , Publish Date - Mar 18 , 2025 | 03:39 PM

తమిళ స్టార్‌ తలైవా రజనీకాంత్‌ను నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కలిశారు. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్‌ మీడియాలో ఫొటోను షేర్‌ చేశారు.


తమిళ స్టార్‌ తలైవా రజనీకాంత్‌ను (Rajanikanth)నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) కలిశారు. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్‌ మీడియాలో ఫొటోను షేర్‌ చేశారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. మోహన్‌లాల్‌ (Mohan Lal)  కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘లూసిఫర్‌ 2: ఎంపురాన్‌’ (Lucifer 2). పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  ‘లూసిఫర్‌2’ ట్రైలర్‌ను రజనీకాంత్‌కు చూపించినట్లు పృథ్వీరాజ్‌ చెప్పారు. ఒక ఫ్యాన్‌బోయ్‌గా ఈ క్షణాలు ఎప్పటికీ గుర్తుంటాయని అన్నారు. ‘‘లూసిఫర్‌2: ఎంపురాన్‌’ ట్రైలర్‌ను అందరికంటే ముందు రజనీకాంత్‌కు చూపించాను. ఆయన ఈ వీడియో చూశాక చెప్పిన మాటలు నేను మర్చిపోలేను. ఈ ఆనందాన్ని మాటల్లొ వర్ణించలేను. ఎప్పటికీ ఆయనకు వీరాభిమానినే’’ అని రాసుకొచ్చారు. పృథ్వీరాజ్‌కు రజినీకాంత్‌ అంటే అమితమైన అభిమానం. దర్శకుడిగా ఆయనతో ఓ సినిమా చేయాలనే కోరికను ఎన్నోసార్లు బయటపెట్టారు. ఒకసారి అవకాశం వచ్చినా డేట్స్‌ కుదరక మిస్‌ అయినట్లు తెలిపారు.

ఇక ‘లూసిఫర్‌2’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మార్చి 27న ప్రేక్షకుల ముందుకురానుందీ సినిమా. 2019లో విడుదలై ఘన విజయం  సాధించిన ‘లూసిఫర్‌’కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది.  

Updated Date - Mar 18 , 2025 | 04:14 PM