Pooja Hegde: అంతకు మించే ఉంటుంది 

ABN , Publish Date - Feb 11 , 2025 | 07:45 AM

హీరో సూర్య నటించే 69వ చిత్రంలో తాను కూడా భాగస్వామి కావడం గర్వంగా ఉందని ప్రముఖ హీరోయిన్‌ పూజా హెగ్డే అన్నారు.

హీరో సూర్య (Suriya 69) నటించే 69వ చిత్రంలో తాను కూడా భాగస్వామి కావడం గర్వంగా ఉందని ప్రముఖ హీరోయిన్‌ పూజా హెగ్డే (Pooja hegde) అన్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ‘రెట్రో’ (Retro)మూవీ చిత్రీకరణ   పూర్తి చేసి మే ఒకటో తేదీన రిలీజ్‌ చేయనున్నారు. ఇందులో తనకు దక్కిన అవకాశంపై పూజా హెగ్డే మాట్లాడుతూ..


Aishwarya.jpg

‘ఇప్పటివరకు నేను నటించిన చిత్రాలన్నీ నన్ను గర్వపడేలా చేశాయి. కానీ, ‘రెట్రో’ మాత్రం నేను గర్వించే చిత్రంగా ఉంటుంది. ఇందులోని ప్రతి సన్నివేశం నాకు చాలా ఇష్టం. షూటింగు సమయంలో పొందిన అనుభూతి ఎన్నటికీ మరిచిపోలేనిది.  సినిమా ఇంకా చూడకుండానే గట్టి నమ్మకంతో చెబుతున్నాను. ప్రస్తుతం ‘రెట్రో’ మూవీ ఎడిటింగ్‌ జరుగతోంది. త్వరలోనే మేకర్స్‌ ఆడియో, ట్రైలర్‌ రిలీజ్‌ తేదీలు వెల్లడిస్తారు’ అని వివరించారు. ప్రస్తుతం తమిళంలో విజయ్ తో 'జన నాయగన్', 'కాంచన 4' చిత్రాలతో బిజీ గా ఉన్నారు.  

Updated Date - Feb 11 , 2025 | 08:12 AM