RIP Shihan Hussaini : బ్లడ్‌ క్యాన్సర్‌తో షిహాన్‌ హుసైని మృతి 

ABN , Publish Date - Mar 25 , 2025 | 03:11 PM

ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్‌కల్యాణ్‌కు మార్షల్‌ ఆర్ట్స్‌, కరాటే, కిక్‌ బాక్సింగ్‌లో శిక్షణ ఇచ్చిన షిహాన్‌ హుసైని కన్నుమూశారు

ప్రముఖ కోలీవుడ్‌ నటుడు షిహాన్‌ హుసైని (Shihan Hussaini - 60) కన్నుమూశారు. కొంతకాలంగా బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదిక తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం, హీరో  పవన్‌కల్యాణ్‌కు (Pawan KalyaN) హుసైని మార్షల్‌ ఆర్ట్స్‌, కరాటే, కిక్‌ బాక్సింగ్‌లో శిక్షణ ఇచ్చారు. హుసైని (Shihan Hussaini) మృతిపై  దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.  

pk.jpg

షిహాన్‌ హుసైని 1986లో విడుదలైన ‘పున్నగై మన్నన్‌’ చిత్రం ద్వారా కోలీవుడ్ కు  పరిచయమయ్యారు. పలు చిత్రాల్లో నటించిన ఆయనకు విజయ్‌ హీరోగా నటించిన ‘బద్రి’ సినిమాతో మంచి గుర్తింపు లభించింది.  ఆర్చరీలోనూ శిక్షకుడిగా ఉన్న ఆయన ఆ రంగంలో 400 మందికి పైగా విద్యార్థులను తయారుచేశారు.

Updated Date - Mar 25 , 2025 | 03:21 PM