Pavithra Gowda: ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసి.. స్వేచ్ఛగా తిరుగుతున్నావా..

ABN , Publish Date - Feb 01 , 2025 | 10:47 AM

హత్య కేసులో నిందితురాలిగా ఉన్న కన్నడ హీరోయిన్‌ పవిత్ర గౌడ 9Pavithra Gowda) మహా కుంభమేళాలో (Maha Kumbh) పవిత్ర స్నానం ఆచరించింది.


ప్రపంచంలో అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాకు (Maha Kumbh Mela)సామాన్యులతో పాటు సెలబ్రిటీలు భారీగా తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో (Triveni Sangamam) పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా హత్య కేసులో నిందితురాలిగా ఉన్న కన్నడ హీరోయిన్‌ పవిత్ర గౌడ 9Pavithra Gowda) మహా కుంభమేళాలో (Maha Kumbh) పవిత్ర స్నానం ఆచరించింది. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నిందితురాలిగా ఉన్న కన్నడ హీరో దర్శన్‌ ప్రియురాలు, నటి పవిత్ర గౌడ ఆధ్యాత్మిక బాట పట్టింది.  ప్రయాగ్‌ రాజ్‌ మహా కుంభమేళాలో (Prayag Raj) దర్శనమిచ్చింది. మౌని అమావాస్య రోజు త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట షేర్‌ చేసింది. 

"ఎంతో పవిత్రమైన మౌని అమావాస్య రోజు మహాకుంభమేళాలో స్నానం ఆచరించడాన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నాను. నెగెటివ్‌ ఎనర్జీ నుంచి నాకు స్వేఛ్ఛ లభించిందని నమ్ముతున్నా’’ అని పోస్ట్‌ పెట్టింది. దీనికి హరహర మహాదేవ్‌ అని క్యాప్షన్‌ జోడించింది. కొద్ది క్షణాల్లోనే పవిత్ర గౌడ పోస్ట్‌, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.


ఆమె పోస్ట్‌ను చూసి,న నెటిజన్లు పవిత్ర గౌడను ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. 'ఒకరి కుటుంబాన్ని రోడ్డున పడేసి నువ్వు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నావా?' అంటూ నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. వీటికి స్పందించిన పవిత్ర గౌడ మరో పోస్ట్‌ పెట్టింది. ‘మతానికి, అన్యాయానికి జరిగిన సంఘర్షణలో మతమే గెలుస్తుంది. నన్ను తిడుతూ, నన్ను బాధపెడుతున్న న్యూస్‌ ఛానల్స్‌, సోషల్‌ మీడియా సైట్స్‌కు చాలా పెద్ద థాంక్స్‌. హద్దులు మీరుతూ మీరు చేస్తున్న కామెంట్లు నా మనసును మరింత క్షోభకు గురి చేస్తున్నాయి. ఇంకా శోకంలోకి నెట్టేస్తున్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేసింది.

READ MORE: Chiranjeevi - Odela Srikanth: మళ్లీ అతనికే అవకాశం ఇచ్చారా.. హైప్‌ ఖాయం..




-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 01 , 2025 | 12:58 PM