Nayanthara: వదంతులకు చెక్.. నయనతారకు క్లియరెన్స్

ABN , Publish Date - Jan 06 , 2025 | 09:44 PM

Nayanthara: చంద్రముఖి సినిమాలోని సన్నివేశాలను పర్మిషన్ లేకుండా వాడుకున్నందుకు రూ. 5 కోట్ల దావాను నిర్మాతలు నయనతార, నెట్‌ఫ్లిక్స్ పై వేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో చంద్రముఖి సినీ నిర్మాణ సంస్థ శివాజీ ప్రొడక్షన్స్ స్పందించింది.

Nayanthara got clearance

చంద్రముఖి(Chandramukhi) సినిమాలోని సన్నివేశాలను పర్మిషన్ లేకుండా నటి నయనతార తన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’((Nayanthara: Beyond The Fairy Tale) లో వాడుకుందని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రముఖి సినీ నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(NOC)ను విడుదల చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..


గతేడాది నటి నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ ల పెళ్లి డాక్యుమెంటరీని ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో, ప్రొడ్యూసర్ ధనుష్ నిర్మించిన ‘నేనూ రౌడీనే’ చిత్రంలోని 3 సెకన్ల క్లిప్ ని పర్మిషన్ లేకుండా వాడుకున్నందుకు ధనుష్ రూ. 10 కోట్ల దావా వేశారు. ఈ వివాదం ఇంకా కోర్టులోనే తిరుగుతోంది. ఈ క్రమంలోనే చంద్రముఖి సినిమాలోని సన్నివేశాలను పర్మిషన్ లేకుండా వాడుకున్నందుకు రూ. 5 కోట్ల దావాను నిర్మాతలు నయనతార, నెట్‌ఫ్లిక్స్ పై వేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో చంద్రముఖి సినీ నిర్మాణ సంస్థ శివాజీ ప్రొడక్షన్స్ స్పందించింది.


తాజాగా శివాజీ ప్రొడక్షన్స్ స్పందిస్తూ.. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీలో చంద్రముఖి సినిమాలోని సన్నివేశాలను మా పర్మిషన్ తీసుకొనే వినియోగించుకున్నారని తెలిపారు. మొత్తం 17 సెకన్ల సన్నివేశాలను రౌడీ పిక్చర్స్ సంస్థ వాడుకోవచ్చు, దీనిపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. అలాగే గతేడాది నవంబర్ లో జారీ చేసిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను ప్రచురించారు. దీంతో అపోహాలపై క్లారిటీ వచ్చేసింది.

noc.jpg

Updated Date - Jan 06 , 2025 | 09:51 PM