Nayanathara: టాక్సిక్‌ షురూ.. హుమాకు విషెస్‌

ABN , Publish Date - Feb 04 , 2025 | 11:23 AM

నయనతార(Nayanathara), హ్యుమా ఖురేషి(Huma qureshi), తారా సుతారియా తదితరులు కీలక పాత్రధారులుగా కనిపించనున్నట్లు సమాచారం. చిత్రీకరణ దశ వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం బెంగళూరులో నాలుగో షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారు.


'కేజీఎఫ్‌'తో పాన్‌ ఇండియా స్థాయిలో స్టార్‌డమ్‌ తెచ్చుకున్నారు. కన్నడ నటుడు యశ్‌(Yash). ప్రస్తుతం ఆయన దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌తో ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’ (Toxic) సినిమా చేస్తున్నారు. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌, యశ్‌ మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కియారా అడ్వాణీ (Kiara adwani) కథానాయిక. నయనతార(Nayanathara), హ్యుమా ఖురేషి(Huma qureshi), తారా సుతారియా తదితరులు కీలక పాత్రధారులుగా కనిపించనున్నట్లు సమాచారం. చిత్రీకరణ దశ వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం బెంగళూరులో నాలుగో షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారు.


ఈ షెడ్యూల్‌తోనే నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా సెట్‌లోకి అడుగుపెడతరిఇన శాండల్‌వుడ్‌ మీడియా చెబుతోంది. ప్రస్తుతం ఈ మొత్తం ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు హ్యుమా ఖురేషి తన కొత్త పుస్తకం జెబా కాపీల్ని ‘టాక్సిక్‌..’ ప్రధాన తారలకు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

నయనతార ఇప్పటికే హ్యుమా కొత్త పుస్తక కాపీని తీసుకున్నట్లు సోషల్‌ మీడియాలో పంచుకుని శుభాకాంక్షలు తెలిపారు. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇటీవల ఈ చిత్రంపై మరో వార్త కూడా వైరల్‌ అయింది. తాజాగా తీసిన నెల రోజుల షెడ్యూల్‌ అవుట్‌ఫుట్‌ హీరోకి నచ్చకపోవడంతో అదంతా పక్కన పెట్టేసి మళ్లీ ఫ్రెష్‌గా చిత్రీకరణ చేస్తున్నారని, నెల రోజుల కష్టం వృథా అయ్యిందని టాక్‌ నడిచింది. అయితే దీనిపై చిత్ర బృందం ఎక్కడ స్పందించలేదు. రవి బస్రూర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.  

Updated Date - Feb 04 , 2025 | 11:48 AM