Nayanatara: ఆమె నయనతారేనా.. ఇదేంటి కొత్తగా..
ABN , Publish Date - Mar 06 , 2025 | 02:37 PM
నటి నయనతార (Nayanatara) తాజా చిత్రం ‘మూకుతీ అమ్మన్ 2’ (Mookuthi Amman 2) లాంఛనంగా మొదలైంది. చెన్నైలో ఏర్పాటుచేసిన భారీ సెట్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమం గురువారం వేడుకగా జరిగింది. దర్శకుడు సుందర్.సి (Sunder c)తోపాటు నయనతార, మీనా(Meena), ఖుష్బూ(Khushnoo), రెజీనా ఈ వేడుకలో సందడి చేశారు
నటి నయనతార (Nayanatara) తాజా చిత్రం ‘మూకుతీ అమ్మన్ 2’ (Mookuthi Amman 2) లాంఛనంగా మొదలైంది. చెన్నైలో ఏర్పాటుచేసిన భారీ సెట్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమం గురువారం వేడుకగా జరిగింది. దర్శకుడు సుందర్.సి (Sunder c)తోపాటు నయనతార, మీనా(Meena), ఖుష్బూ(Khushnoo), రెజీనా ఈ వేడుకలో సందడి చేశారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. సాధారణంగా తన సినిమా పూజా కార్యక్రమం, ప్రమోషన్స్‌కు (Nayanatara promotions) దూరంగా ఉండే నయనతార ఉన్నట్టుండి ఈ వేడుకలో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ఆమె నమస్కరిస్తోన్న వీడియోలు షేర్ చేసిన నెటిజన్లు.. ‘‘ఆమె నయనతారేనా.. ఇదేంటి కొత్తగా’’ అని కామెంట్లు పెడుతున్నారు.
సుమారు 22 ఏళ్ల కెరీర్‌లో నయన్ ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ వాటి ప్రమోషన్స్‌కు మాత్రం ఆమె దూరంగానే ఉండేవారు. ప్రాజెక్ట్‌పై సంతకం చేసినప్పుడే ప్రమోషన్స్‌కు రాననే విషయాన్ని కూడా ఆమె అగ్రిమెంట్‌లో మెన్షన్ చేస్తుందని టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన సినిమా పూజా కార్యక్రమంలో ఆమె దర్శనమివ్వడం ఇప్పుడు అంతటా వైరల్‌గా మారింది.
నయనతార కథానాయికగా ఆర్జే బాలాజీ తెరకెక్కించిన చిత్రం ‘మూకుతీ అమ్మన్’. 2020లో ఇది విడుదలై విశేష ఆదరణను సొంతం చేసుకుంది. అమ్మవారి పాత్రలో నయనతార నటించారు. ఇదే చిత్రం తెలుగులో ‘అమ్మోరు తల్లి’గా విడుదలైంది. దీనికి కొనసాగింపుగా ‘మూకుతీ అమ్మన్ 2’ వస్తోంది. ఈ సినిమా గురించి నిర్మాత గణేష్ మాట్లాడారు. ‘‘సుమారు 30 రోజుల్లోనే దర్శకుడు సుందర్ ఈ కథను సిద్థం చేశారు. ఇలాంటి కథను ఈ మధ్య కాలంలో వినలేదు. మరోసారి అమ్మవారి పాత్రలో నయనతార కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ఆమె నెల రోజులపాటు ఉపవాసం చేస్తున్నారు. రూ.100 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు.
ALSO READ: Agent on Ott: ఎట్టకేలకు అఖిల్ ‘ఏజెంట్’కు దారి దొరికింది
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి