Lyca Productions: మణిరత్నం - శింబు కాంబోలో....
ABN , Publish Date - Apr 29 , 2025 | 03:40 PM
మణిరత్నం దర్శకత్వంలో శింబు ఇప్పటికే రెండు సినిమాల్లో నటించాడు. అందులో ఒకటి విడుదల కాగా మరొకటి విడుదలకు సిద్థంగా ఉంది. త్వరలో ఈ కాంబోతో మరో సినిమా రాబోతోందట.
ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం (Maniratnam), విఖ్యాత నటుడు కమల్ హాసన్ (Kamal Hassan) కాంబినేషన్ లో 'నాయకుడు' (Nayakudu) తర్వాత వస్తున్న సినిమా 'థగ్ లైఫ్' (Thug Life). ఈ సినిమాను వీరిద్దరూ కలిసి నిర్మిస్తున్నారు. జూన్ 5వ తేదీ 'థగ్ లైఫ్' మూవీ పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో విడుదల కాబోతోంది. ఎ.ఆర్. రెహమాన్ (A.R. Rehman) దీనికి సంగీతం అందించారు. విశేషం ఏమంటే... దీని తర్వాత మణిరత్నం చేయబోయే సినిమా కూడా ఇప్పటికే ఫైనలైజ్ అయ్యిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 'థగ్ లైఫ్'లో కమల్ హాసన్ తో పాటు కీలక పాత్రను పోషించిన శింబు (Simbu)... మణిరత్నం తదుపరి చిత్రంలో హీరోగా నటించబోతున్నాడట. విశేషం ఏమంటే... 'థగ్ లైఫ్'కు ముందు కూడా 'చెక్క చివంద వానమ్' మూవీలో శింబు కీ-రోల్ ప్లే చేశారు. అప్పుడు ఏర్పడిన అనుబంధంతోనే మణిరత్నం 'థగ్ లైఫ్'లో శింబుకు మరోసారి ఛాన్స్ ఇచ్చాడు. ఇచ్చిన పాత్రను అర్థం చేసుకుని అందులోకి పరకాయ ప్రవేశం చేసే శింబు అంటే మణిరత్నంకు బాగా గురి కుదిరిందనిపిస్తోంది. అందుకే తన తదుపరి చిత్రంలో అతన్నే హీరోగా ఎంపిక చేసుకున్నాడని అంటున్నారు. 'చెక్క చివంద వానమ్' మూవీ తెలుగులో 'నవాబ్' పేరుతో డబ్ అయ్యింది కానీ ఇక్కడీ సినిమా పెద్దంతగా ఆడలేదు.
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియన్ సెల్వన్'ను తెరకెక్కించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ మణిరత్నం - శింబు మూవీని నిర్మించబోతోందట. విశేషం ఏమంటే... శింబు 'థగ్ లైఫ్'తో పాటు మరో మూడు సినిమాలను చేస్తున్నాడు. జూన్ లో 'థగ్ లైఫ్' విడుదలైన తర్వాత మరి అతను ఏ సినిమాలకు ప్రాధాన్యమిస్తాడు, మణిరత్నం సినిమాకు ఎలా డేట్స్ అడ్జెస్ట్ చేస్తాడు అనేది వేచిచూడాలి.
Also Read: Heera: అజిత్ పై ఆరోపణల వెనుక హస్తమెవరిది...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి