Mandaadi: తమిళ చిత్రసీమలోకి సుహాస్
ABN , Publish Date - Apr 21 , 2025 | 09:49 AM
ప్రముఖ హాస్యనటుడు సుహాస్ తెలుగులో ఇప్పుడు అర్థవంతమైన చిత్రాలలో కథానాయకుడిగా చేసి మెప్పిస్తున్నాడు. తాజాగా సుహాస్ కు తమిళ సినిమా రంగంలోనూ అవకాశం వచ్చింది. అతను కీలక పాత్ర పోషిస్తున్న 'మందాడి' సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.
ప్రముఖ తమిళ నిర్మాత, నటుడు ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్న 16వ చిత్రం 'మందాడి' (Mandaadi) . ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. తన తొలి చిత్రం 'సెల్ఫీ'తో బలమైన ముద్ర వేసిన మతిమారన్ పుహళేంది రచన, దర్శకత్వం వహించిన ‘మందాడి’ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో సూరి (Soori) ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. 'మందాడి'తో తెలుగు నటుడు సుహాస్ (Suhaas) తమిళ చిత్రసీమలోకి అడుగు పెట్టడం విశేషం. మహిమా నంబియార్ (Mahima Nambiar) ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్ (Sathyaraj), రవీంద్ర విజయ్ (Ravindra Vijay), అచ్యుత్ కుమార్, సచ్చనా నమిదాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
తమిళనాడులోని రామనాథపురం సముద్ర తీరప్రాంతాలలో టెస్ట్ షూట్ ను జరిపారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. బోట్ రేస్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో మానవ సంబంధాలను కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నామని మేకర్స్ చెబుతున్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర బృందం సెయిల్ బోట్ రేసింగ్ పై డాక్యుమెంటరీని ప్రదర్శించింది. ఈ సినిమా ప్రేక్షకులను 'మందాడి' ప్రపంచంలోకి తీసుకెళ్ళబోతోంది. రామనాథపురం, ట్యూటికోరిన్ తీర ప్రాంతాలలో 'మందాడి' అంటే నాయకత్వం వహించే అనుభవజ్ఞడైన నిపుణుడు అని అర్థం. సముద్ర ప్రవాహాలు, గాలి దిశలు, అలల నమూనాలను గురించి అసాధారణమైన అవగాహన కలిగిన వ్యక్తిని ఆ పేరుతో పిలుస్తారు. చేపల కదలికలను అంచనావేయడంలోనూ, ప్రమాదకరమైన అలలను నావిగేట్ చేయడంలో మందాడి కీలక పాత్ర పోషిస్తుంటాడు. ఈ కారణంగానే అతను పడవ పందెంలోనూ తిరుగులేని నాయకుడిగా నిలుస్తుంటాడు. ఈ సినిమాలో టైటిల్ రోల్ ను సూరి చేయబోతున్నాడు. అతని కెరీర్ లో ఈ సినిమా ఓ ప్రత్యేక మైలురాయిగా నిలుస్తుందని దర్శకుడు, రచయిత మతిమారన్ పుహళేంది తెలిపాడు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి సహకరించిన వెట్రిమారన్ (Vetri Maaran) కు అతను కృతజ్ఞతలు తెలిపాడు. జీవీ ప్రకాశ్ (GV Prakash) ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండగా, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫీ చేయబోతున్నాడు.
Also Read: NTR: ఆడవేషంలో పెద్దాయన....
Also Read: Tollywood: పూరి జగన్నాథ్ రెండున్నర దశాబ్దాల ప్రస్థానం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి