Actor Vinayakan: 'జైలర్' విలన్‌కు ఏమైంది.. మరోసారి రచ్చ

ABN , Publish Date - Jan 21 , 2025 | 12:34 PM

Actor Vinayakan: వెండి తెరపై ఎక్కువగా విలన్ వేషాలు వేసే అతను నిజ జీవితంలోనూ అలాగే ప్రవర్తిస్తుంటారు. తరుచు ఎదో వివాదాలతో వార్తల్లో నిలిచే ఆయన మరోసారి తాగుతూ రచ్చ చేశాడు. దీంతో ఆయనకు వివాదాలు కొత్తేమీ కాదంటూ నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Actor Vinayakan

ప్రముఖ మలయాళ నటుడు వినాయకన్.. దక్షిణాది సినిమాల్లో ఇప్పుడు బాగా పాపులరైన నటుడు. ఇటీవల విడుదలైన జైలర్ మూవీలో ఆయన నటన అద్భుతమనే చెప్పాలి. అయితే వెండి తెరపై ఎక్కువగా విలన్ వేషాలు వేసే అతను నిజ జీవితంలోనూ అలాగే ప్రవర్తిస్తుంటారు. తరుచు ఎదో వివాదాలతో వార్తల్లో నిలిచే ఆయన మరోసారి తాగుతూ రచ్చ చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..


నటన, వివాదాలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ నటుడు వినాయకన్ మరోసారి రచ్చ చేశాడు. తాజాగా కొచ్చిలోని తన అపార్ట్మెంట్ బాల్కనీ లో విచ్చలవిడిగా తాగి తన ఇరుగు పొరుగింటి వారిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడడు. ఆయన కేవలం లుంగీ ధరించి చేసిన ఈ విన్యాసాలన్నీ కెమెరా కన్నుకి చిక్కాయి. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


అయితే నటుడు వినాయకన్‌కు వివాదాలు కొత్తేమీ కాదు. గతేడాది అక్టోబర్ నెలలో హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయన రచ్చరచ్చ చేశారు. సీఐఎస్ఎఫ్ సిబ్బందితో గొడవకు దిగడంతో పోలీసులు అతన్ని అరెస్టు సైతం చేశారు. సీఐఎస్ఎఫ్ సిబ్బందిని కొట్టారనే ఆరోపణలు సైతం అతనిపై ఉన్నాయి. కేరళలోని ఎర్నాకులంలో వినాయకన్‌కు సొంతిల్లు ఉంది. అయితే ఆయన రాత్రి మెుత్తం తాగుతూ పక్కింటి వారితో గొడవకు దిగాడు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వినాయకన్ అక్కడా దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అయితే వినాయకన్ తిరిగి బెయిల్‌పై విడుదల అయ్యారు. ఆయన మద్యానికి పూర్తిగా బానిసయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే వినాయకన్ తరచూ వివాదాలకు వెళ్తున్నారని సినీవర్గాలు చెప్తున్నాయి. మంచి నటుడే అయినప్పటికీ ప్రవర్తన కూడా ముఖ్యమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Also Read- Dil Raju: 'దిల్ రాజు'పై ఐటీ దాడులు..

Also Read-Ram Gopal Varma: ఫ్యాన్స్‌ని ఏడిపించేసిన ఆర్జీవీ.. కంబ్యాక్ స్ట్రాంగర్ వర్మ

Also Read-Pushpa 2: సంధ్యలో పుష్ప గాడి ర్యాంపేజ్..

Also Read- Anil Ravipudi: 'బుల్లిరాజు'పై విమర్శలు.. చెక్ పెట్టిన అనిల్ రావిపూడి

మా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 21 , 2025 | 12:34 PM