L2E EMPURAAN: సీనియర్ హీరోలు మోహన్ లాల్‌ని చూసి నేర్చుకోవాలి

ABN , Publish Date - Jan 26 , 2025 | 09:57 PM

L2E EMPURAAN: "ది కంప్లీట్ యాక్ట‌ర్‌ మోహ‌న్ లాల్ టైటిల్ పాత్ర‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్‌, ఆశీర్వాద్ సినిమాస్ బ్యాన‌ర్స్‌పై పృథ్వీరాజ్ సుకుమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సుభాస్క‌ర‌న్‌, ఆంటోని పెరుంబ‌వుర్ నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘L2ఇ ఎంపురాన్’ టీజ‌ర్ విడుద‌ల‌..గూజ్ బ‌మ్స్ విజువ‌ల్స్‌తో నెక్ట్స్ రేంజ్‌కు పెరిగిన ఎక్స్‌పెక్టేష‌న్స్‌."

Mohanlal in L2E EMPURAAN

ది కంప్లీట్ యాక్ట‌ర్ మోహ‌న్ లాల్ టైటిల్ పాత్ర‌లో న‌టించి 2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించిన చిత్రం ‘లూసిఫ‌ర్‌’. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘L2ఇ ఎంపురాన్’ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. మ‌ల‌యాళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రం మార్చి 27న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. కంటెంట్ సినిమాల‌తో పాటు.. స్టార్ హీరోల‌తో భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మించే చిత్ర నిర్మాణ సంస్థ‌ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమార‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. లూసిఫ‌ర్‌, బ్రో డాడీ చిత్రాల తర్వాత మోహ‌న్ లాల్‌, పృథ్వీరాజ్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూడో సినిమా ఇది. ఈ క్రేజీ మూవీతో జి.కె.ఎం.త‌మిళ్‌ కుమ‌ర‌న్ నేతృత్వంలో లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్ మ‌ల‌యాళ సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టారు. తొలి భాగం లూసిఫ‌ర్‌ హిట్ కావ‌టంతో సినిమాపై ఎలాంటి అంచ‌నాలున్నాయో ముందుగానే అంచ‌నా వేసిన మేక‌ర్స్ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మించేలా సినిమాను నిర్మిస్తున్నారు. అనౌన్స్‌మెంట్ రోజు నుంచే సినిమా ఎలా ఉంటుందోన‌ని అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ‘L2ఇ ఎంపురాన్’ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లేలా మేక‌ర్స్ ఆదివారం టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.


టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే..

ఖురేషి ఉండే టౌన్ నార్త్ ఇరాక్‌లో విజువ‌ల్స్‌ను చూపించ‌టం ద్వారా టీజ‌ర్ మొద‌లైంది. ఏదో ఒక‌రోజు నీ చుట్టూ ఉన్న వాళ్లంద‌రూ మోస‌గాళ్లు అనిపించినప్పుడు.. ఈ నాన్న లేకుంటే.. నిన్ను ఆదుకోగ‌లిగిన‌వాడు ఒక్క‌డే ఉంటాడు. అత‌డే స్టీఫెన్ అనే ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌తో హీరో మోహ‌న్ లాల్ క్యారెక్ట‌ర్‌ను ఇంట్ర‌డ్యూస్ చేశారు. ఈ యుద్ధం మంచికి, చెడుకి కాదు.. చెడుకి, చెడుకి మ‌ధ్య‌, అనే మ‌రో డైలాగ్‌తోపాటు..

జ‌గ‌దీష్ స్టీఫెన్ హిందువుల‌కు త‌ను మ‌హిరావ‌ణుడు, ముస్లింలు ఇబ్లిస్ అని పిలుస్తారు.. క్రిస్టియానిటీలో ఇత‌నికి ఒకే ఒక పేరుంది.. లూసిఫ‌ర్ అనే డైలాగ్ హీరో ఎంత ప‌వ‌ర్‌ఫుల్లో అనేది ఎలివేట్ చేశారు.

హీ ఈజ్ క‌మింగ్ బ్యాక్ అనే డైలాగ్ త‌ర్వాత మోహ‌న్ లాల్ లుక్‌ను రివీల్ చేశారు. ఖురేషి అబ్రామ్ అని మోహ‌న్ లాల్ త‌న మ‌రో పేరుని ర‌వీల్ చేయ‌టం.. మిల‌టరీ వాళ్లు స్టీఫెన్‌ను టార్గెట్ చేయ‌టం 'దిస్ డీల్ విత్ డెవిల్' అని మోహ‌న్ లాల్ చెప్ప‌టం.. ఒక్క మాట భాయ్ జాన్‌, నేను ఎదురు చూస్తున్నాను అని చివ‌రో పృథ్వీరాజ్ సుకుమార‌న్ చెప్పే డైలాగ్ వాటికి అనుగుణంగా వ‌చ్చే విజువ‌ల్స్ ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తున్నాయి.


లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్‌, ఆశీర్వాద్ సినిమాస్ అధినేత ఆంటోని పెరుంబ‌వుర్ సినిమాను అన్‌కాంప్రైమ‌జ్డ్‌గా నిర్మించార‌ని విజువ‌ల్స్ చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. లూసిఫ‌ర్ కంటే సినిమా మ‌రింత గ్రిప్పింగ్‌గా, గూజ్ బ‌మ్స్ వ‌చ్చేలా స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ ఉంది. ఇంకా ఈ చిత్రంలో టోవినో థామ‌స్‌, మంజు వారియ‌ర్‌, నందు, సానియా అయ్య‌ప్ప‌న్ త‌దిత‌రులు మ‌రోసారి వారి పాత్ర‌ల‌తో మెప్పించ‌బోతున్నారని స్ప‌ష్ట‌మ‌వుతుంది. ముర‌ళీ గోపి క‌థ‌ను అందించిన ఈ చిత్రానికి దీప‌క్ దేవ్ మ్యూజిక్‌, బ్యాగ్రౌండ్ స్కోర్‌, సుజిత్ వాసుదేవ‌న్ సినిమాటోగ్ర‌ఫీ వావ్ అనిపిస్తున్నాయి. సురేష్ బాలాజీ, జార్జ్ ప‌యూష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌గా, పృథ్వీరాజ్ ప్రొడ‌క్ష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా , మోహ‌న్ దాస్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేశారు. ఈ సినిమా మార్చి 27న తెలుగు, మ‌ల‌యాళ‌, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌ కానుంది.


Also Read- Padma Awards: టాలీవుడ్‌లోని నటులకు ఏ ఏజ్‌లో పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అవార్డులు వచ్చాయంటే..

Also Read-Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్..

Also Read- Anil Ravipudi: ఇండస్ట్రీలోకి రాకముందే అనిల్ ప్రేమకి సహాయం చేసిన నటులు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 26 , 2025 | 09:57 PM