R Madhavan: అమ్మాయిలకు మెసేజ్‌లు.. వివరణ ఇచ్చిన హీరో 

ABN , Publish Date - Mar 02 , 2025 | 07:15 PM

అమ్మాయిలను ఆకర్షించేలా నటుడు మాధవన్ (Madhavan) మెసేజ్‌లు చేస్తుంటారని, ఆన్‌లైన్‌ వేదికగా యువతులకు మాత్రమే సందేశాలు పంపుతారంటూ ఎన్నో రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది.

అమ్మాయిలను ఆకర్షించేలా నటుడు మాధవన్ (Madhavan) మెసేజ్‌లు చేస్తుంటారని, ఆన్‌లైన్‌ వేదికగా యువతులకు మాత్రమే సందేశాలు పంపుతారంటూ ఎన్నో రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అవన్నీ అసత్యాలు మాత్రమేనని  తాజాగా  ఓ కార్యక్రమంలో చెప్పారు. ఈ విధమైన ఆరోపణలు ఎదుర్కోవడానికి కారణమైన సంఘటన గురించి వెల్లడించారు9Rumours on Madhavan).

‘‘నేను సోషల్ మీడియాలో తక్కువగా కనిపిస్తా. అభిమానులకు కూడా త్వరగా రిప్లైలు ఇవ్వను. కొంతకాలం క్రితం ఇన్‌స్టాలో నాకొక అమ్మాయి సందేశం పంపించింది. నేను నటించిన ఓ సినిమా గురించి ఆమె వివరణాత్మకంగా మెసేజ్‌ చేసింది. ‘‘సర్‌ మీరంటే నాకెంతో ఇష్టం. మీరు నటించిన ఆ సినిమా చూశాను. ఇది నాకెంతో ఇచ్చింది. మీరు అద్భుతమైన నటుడు అందులో సందేహం లేదు. ఇందులో మీ నటన చాలా బాగుంది. మీరు నాలో ఎంతో స్ఫూర్తి నింపారు’’ అని పేర్కొంటూ ముద్దులు, హార్ట్‌ ఎమోజీలు జత చేసింది.(Madhavan Kisses and Hugs for Girls)

ఆమె అంతలా అభిమానం చూపించినప్పుడు స్పందించకపోతే బాగోదు కనుక నేను కూడా ‘థాంక్యూ సో మచ్‌. గాడ్‌ బ్లెస్‌ యు’  అని రిప్లై  ఇచ్చాను. ఆ యువతి.. తన పోస్ట్‌లోని సగం (ముద్దు, హార్ట్‌ ఎమోజీలు- Madhavan HUgs and kisses), నా పోస్ట్‌ని కలిసి స్క్రీన్‌ షాట్‌ తీసుకుని సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టింది. మాధవన్‌ నాకు సందేశం పంపారని  షేర్ చేసింది. అది చూసిన చాలా మంది నేను ఆమెకు ముద్దు, హార్ట్‌ ఎమోజీలు పంపించానని అనుకున్నారు. యువతలను మభ్యపెట్టేలా సందేశాలు పంపుతానని మాట్లాడుకున్నారు. ఆ సంఘటన తర్వాత సోషల్‌మీడియా వాడకం విషయంలో ఎంతో క్లారిటీతో ఉంటున్నా’’ అని మాధవన్ తెలిపారు. 

Updated Date - Mar 03 , 2025 | 08:42 AM