Lucifer 2: లూసిఫర్‌ 2 వాయిదా.. దర్శకుడు కామెంట్‌

ABN , Publish Date - Mar 15 , 2025 | 04:38 PM

‘లూసిఫర్‌2: ఎంపురాన్‌’ సినిమా వాయిదా పడిందంటూ సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ స్పందించారు.

మోహన్‌లాల్‌ (Mohanlal) కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘లూసిఫర్‌2: ఎంపురాన్‌’ (L2: Empuraan). పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వాయిదా పడిందంటూ సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ స్పందించారు. ఆ రూమర్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. లైకా ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఈ సినిమా విడుదల కానుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ నిర్మాణ సంస్థ ఈ సినిమాను విడుదల చేయడం లేదంటూ సోషల్‌ మీడియాలో కొందరు పోస్ట్‌లు పెట్టారు.

వీటికి పరోక్షంగా పృథ్వీరాజ్‌ స్పందిస్తూ ‘‘ఇది సరైన సమయం.. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. విలన్‌ మీ కోసం వచ్చేస్తున్నాడు. తాను సిద్థంగా లేడని ఒప్పించడానికి విలన్‌ ప్రయత్నిస్తున్నాడు. అది అతడి గొప్ప ట్రిక్‌’’ అని రాసుకొచ్చారు. ‘లూసిఫర్‌’కు కొనసాగింపుగా వస్తున్న చిత్రమిది. మార్చి 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవలే సెన్సార్‌ పూర్తి చేసుకుంది. 2గంటల 59 నిమిషాల నిడివితో గల ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది.  

Updated Date - Mar 15 , 2025 | 04:38 PM