Khushbu Sundar: పెళ్ళి రోజు సందర్భంగా భర్తకు గుండు!

ABN , Publish Date - Mar 10 , 2025 | 10:49 AM

నటి ఖుష్బూ, దర్శకుడు సి సుందర్ వివాహం జరిగి పాతికేళ్ళు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఈ జంట దైవ దర్శనం చేసుకుంది. ఈ సక్సెస్ ఫుల్ జోడీకి సినీ ప్రముఖులు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

నటి ఖుష్బూ (Khushbu) బాలనటిగా కెరీర్ ప్రారంభించి, కథానాయికగా ఎదిగింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న ఖుష్బూకు తెలుగులోనే కాదు... తమిళంలోనూ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆమెపై విపరీతమైన ప్రేమను పెంచుకున్న తమిళ అభిమానులు ఏకంగా అప్పట్లో గుడి కూడా కట్టారు. నటిగా రాణిస్తున్న సమయంలోనే దర్శకుడు సుందర్ సి (Sundar C) ని ఖుష్బూ ప్రేమ వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు.


సామాజిక కార్యక్రమాలలోనూ బిజీగా ఉండే ఖుష్బూ రాజకీయ రంగప్రవేశం చేసి, ప్రత్యక్షరాజకీయాల్లోనూ పాల్గొంది. డీఎంకే పార్టీతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరింది. ప్రస్తుతం ఖుష్బూ బీజేపీలో ఉంది. ఆమె భర్త దర్శకుడు సుందర్ సినిమాలను తెరకెక్కిస్తూనే, కీలక పాత్రలూ పోషిస్తున్నారు. అలానే సొంత బ్యానర్ లో చిత్రాలను నిర్మిస్తున్నారు. ఓ పక్క సినిమాల్లో నటిస్తూ, పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంటూ కూడా ఖుష్బూ ఈ సినిమా నిర్మాణ వ్యవహారాలను చక్కదిద్దుతూ ఉంటారు. ఆ మధ్య సుందర్ నిర్మించిన 'అరణ్మనై-4' వంద కోట్ల గ్రాస్ ను సాధించింది. తెలుగులోనూ 'బాక్' పేరుతో డబ్ అయ్యి, ఇక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ యేడాది సంక్రాంతి కానుకగా సుందర్ సి గతంలో తెరకెక్కించిన 'మదగజరాజా' విడుదలైంది. ఈ సినిమా కూడా పొంగల్ బరిలో తన సత్తాను చాటింది. ప్రస్తుతం సుందర్ సి. నయనతార (Nayantara) నాయికగా 'మూకుత్తి అమ్మన్' (Mookuthi Amman) మూవీకి సీక్వెల్ చేస్తున్నారు.


ఇదిలా ఉంటే... 2000 సంవత్సరంలో సుందర్ ని వివాహం చేసుకున్న ఖుష్బూ తన వైవాహిక జీవితానికి పాతికేళ్ళు నిండాయనే విషయాన్ని పోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియచేసింది. అందులో పెళ్ళినాటి ఫోటోతో పాటు తాజాగా దైవదర్శనం చేసుకున్న అనంతరం సుందర్ గుండు చేయించుకున్నప్పటి ఫోటోనూ పోస్ట్ చేసింది. విషయం తెలిసిన అభిమానులు, తోటి నటీనటులు ఈ జంటకు సిల్వర్ జూబ్లీ మ్యారేజ్ డే విషెస్ తెలియచేశారు.

Also Read: Samantha : నందినీ రెడ్డితో సమంత మరోసారి...

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 10 , 2025 | 10:49 AM