Keerthy Suresh: పవీష్‌.. ప్రతి విషయంలో ధనుష్‌ని గుర్తుచేశాడు

ABN , Publish Date - Feb 21 , 2025 | 03:02 PM

తాజాగా ‘నిలవుకు ఎన్‌మేల్‌ ఎన్నడి కోబమ్‌' సినిమాను కీర్తిసురేశ్‌ వీక్షించారు. ఈ సినిమా తనకెంతో నచ్చిందని సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టారు.


హీరో ధనుష్‌ (Dhanush) మేనల్లుడు పవిష్‌ నారాయణ్‌I(Pavish) హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘నిలవుకు ఎన్‌మేల్‌ ఎన్నడి కోబమ్‌’(Nilavuku En Mel Ennadi Kobam). ధనుష్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అనిఖ సురేంద్రన్‌, ప్రియాప్రకాశ్‌ వారియర్‌(Priya Prakash Warrier), మాథ్యూ థామస్‌, రమ్య రంగనాథన్‌ కీలక పాత్రధారులు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకువచ్చింది. తాజాగా ఈ సినిమాను కీర్తిసురేశ్‌ వీక్షించారు. ఈ సినిమా తనకెంతో నచ్చిందని సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టారు. (Keerthy suresh Review)

Keerthi.jpg

‘‘ఇప్పుడే ఈ సినిమా చూశాను. చాలా కొత్తగా, చూడచక్కగా ఉంది. ధనుష్‌.. మీ డైరెక్షన్‌లో మరో విభిన్నమైన కథను సృష్టించారు. ఇంతమంది నటీనటులను స్ర్కీన్‌పై చూడటం ఎంతో సంతోషంగా ఉంది. పవిష్‌.. హావభావాలు. వాయిస్‌, యాక్షన్‌ ఇలా ప్రతి విషయంలో నువ్వు ధనుష్‌ని గుర్తుచేశావు. అద్భుతమైన చిత్రంతో ఇండస్ర్టీలోకి అడుగుపెట్టావు. మాథ్యూ థామస్‌.. నీ పాత్ర ప్రేక్షకులకు  గుర్తుండిపోతుంది. ప్రియాంకా మోహన్‌.. నీ డ్యాన్స్‌ అదిరింది. టీమ్‌ అందరికీ అభినందనలు’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఈ చిత్రాన్ని తెలుగులో  ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అనే పేరుతో విడుదలైంది.  ‘రాయన్‌’ తర్వాత ధనుష్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. తెలుగులోనూ పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. 

Updated Date - Feb 21 , 2025 | 03:02 PM