Kichcha Sudeep: హీరోలు బోర్ కొట్టేస్తారు.. సుదీప్ సెన్సేషనల్ కామెంట్స్
ABN , Publish Date - Jan 14 , 2025 | 09:01 AM
Kichcha Sudeep: ప్రతి హీరో ఏదో ఒక సమయంలో బోర్ కొట్టేస్తాడు. అందరికీ ఒక టైమ్ అనేది ఉంటుంది. ఇన్నేళ్ల నా కెరీర్‌లో ఒక హీరోగా నేనెప్పుడూ సెట్‌లో ఎవరినీ వెయిట్ చేయించలేదు. భవిష్యత్తులో సపోర్టింగ్ రోల్‌లో చేస్తే.. ఇంకొకరి కోసం ఎదురుచూస్తూ కూర్చోను.
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2012లో వచ్చిన రాజమౌళి 'ఈగ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా ఆయన 1997 శాండల్ వుడ్ లో డెబ్యూ చేశాడు. 2000లో వచ్చిన 'స్పర్శ' మూవీతో హిట్టు అందుకున్నాడు. 2003లో వచ్చిన 'కిచ్చా' సినిమా ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. ఆయన లేటెస్ట్ ఫిల్మ్ ‘మ్యాక్స్’ థియేటర్ లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆయన తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి మాట్లాడుతూ.. " నేను ఇంకా అలిసిపోలేదు.. కానీ ఎదో ఒక సమయంలో పక్కా రిటైర్ అవుతాను. ప్రతి హీరో ఏదో ఒక సమయంలో బోర్ కొట్టేస్తాడు. అందరికీ ఒక టైమ్ అనేది ఉంటుంది. ఇన్నేళ్ల నా కెరీర్‌లో ఒక హీరోగా నేనెప్పుడూ సెట్‌లో ఎవరినీ వెయిట్ చేయించలేదు. భవిష్యత్తులో సపోర్టింగ్ రోల్‌లో చేస్తే.. ఇంకొకరి కోసం ఎదురుచూస్తూ కూర్చోను. సోదరుడు, మామయ్య వంటి పాత్రలు చేయడానికి నాకు ఆసక్తి లేదు" అన్నారు. అలాగే తాను రిజెక్ట్ సినిమాల గురించి మాట్లాడుతూ.. అవి కథలు నచ్చకపోవడం వల్ల రిజెక్ట్ చేయలేదు.. ఈ సమయంలో వాటిని ఎంపిక చేసుకోవడం సరైన నిర్ణయం కాదని వాటిని అంగీకరించలేదు. నటనకు విరామం తీసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యే ప్రసక్తే లేదు. ఒకవేళ ప్రధాన పాత్ర అవకాశాలు రాకపోతే దర్శకత్వం, ప్రొడక్షన్ వైపు వెళ్తాను. నేను హీరోగా ఇప్పటివరకు సాధించిన దానికి ఎంతో సంతృప్తిగా ఉన్నన్ని" చెప్పారు.
ఇక ఆయన లేటెస్ట్ ఫిల్మ్ మ్యాక్స్ విషయానికొస్తే.. మాస్ జనాలకు మ్యాగ్జిమమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే సినిమా ఇది. ఫ్లోలో వెళ్తున్న సినిమా చూసి, ప్రేక్షకుడు వావ్ అనుకునే కమర్షియల్ సినిమాల్లో లాజిక్కులు పట్టుకోవలసిన అవసరం లేదు. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నాడా లేదా అన్నదే ఈ ముఖ్యం. మ్యాక్స్ కొత్త కథ కాకపోయినా.. ప్రేక్షకుడితో చప్పట్లు కొట్టించేలా ఉంది. మాస్ యాక్షన్ చిత్రాలు కోరుకునే వారికి ఈ నచ్చుతుంది అనడంతో ఎలాంటి సందేహం లేదు.