Jyothi Poorvaj: కిల్లర్ హీరోయిన్ కు కర్ణాటక స్టేట్ అవార్డ్
ABN , Publish Date - Mar 13 , 2025 | 11:12 AM
జ్యోతి పూర్వాజ్ తెలుగులో పలు చిత్రాలలో నటిస్తున్నారు. ఆమె నటించిన కన్నడ చిత్రం 'వర్ణపతల'కు ఉత్తమ ద్వితీయచిత్రంగా స్టేట్ అవార్డ్ దక్కింది.
తెలుగులో వరుస చిత్రాలతో తన సత్తాను చాటుతోంది కన్నడ నాయిక జ్యోతి పూర్వజ్ (Jyothi Poorvaj). ఆమె ప్రస్తుతం సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'కిల్లర్' (Killer) లో నటిస్తోంది. విశేషం ఏమంటే ఆమె నటించిన కన్నడ చిత్రం 'వర్ణపతల' (Varnapatala) కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులో రెండవ ఉత్తమ చిత్రంగా నిలచించింది. ఈ అవార్డు రావడం పట్ల జ్యోతి పూర్వజ్ హర్షం వ్యక్తం చేయగా, 'కిల్లర్' టీమ్ ఆమెను అభినందించింది.
''శుక్ర (Shukra), మాటరాని మౌనమిది (Matarani Maunamidi), ఏ మాస్టర్ పీస్ (A Masterpiece)'' వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ ప్రస్తుతం కిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పూర్వాజ్ (Poorvaj) హీరోగా నటిస్తుండగా, జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తోంది. విశాల్ రాజ్, గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. థింక్ సినిమా బ్యానర్ పై ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థలతో కలిసి పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభ రెడ్డి దీనిని నిర్మిస్తున్నారు. 'కిల్లర్' పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
Also Read: Court Review: ప్రియదర్శి కోర్ట్ రూమ్ డ్రామా ఎలా ఉందంటే...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి