Jayam Ravi: ఇకపై అలా పిలవద్దు....

ABN , Publish Date - Jan 14 , 2025 | 12:04 AM

తనను జయం రవి అని పిలవొద్దని నటుడు విజ్ఞప్తి చేశారు. తన అసలు పేరు రవి మోహన్‌ లేదా రవి అని పిలవాలనికోరారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఆ పేరునే కొనసాగించాలనుకుంటున్నానని అన్నారు.

తనను జయం రవి (Jayam Ravi) అని పిలవొద్దని నటుడు విజ్ఞప్తి చేశారు. తన అసలు పేరు రవి మోహన్‌ లేదా రవి అని పిలవాలనికోరారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఆ పేరునే కొనసాగించాలనుకుంటున్నానని అన్నారు.  ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా నోట్‌ విడుదల చేశారు. మరోవైపు, ‘రవి మోహన్‌ స్టూడియోస్‌’ పేరిట నిర్మాణ సంస్థను, ‘రవి మోహన్‌ ఫ్యాన్స్‌ ఫౌండేషన్‌’ ఆర్గనైజేషన్‌ను కొత్త ఏడాదిలో ప్రారంభించామని తెలియజేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. తన సోషల్‌ మీడియా ఖాతా పేరునూ మార్చుకున్నారు. ‘‘సినిమాపై ప్యాషన్‌తో నిర్మాణ సంస్థను ప్రారంభించా. ప్రతిను ప్రోత్సహిస్తూ మంచి చిత్రాలను అందించాలనేది మా నిర్మాణ సంస్థ లక్ష్యం. అభిమానులే నా బలం. మెరుగైన సమాజం కోసం నా వంతు కృషి చేేసందుకు వారే స్ఫూర్తినిస్తుంటారు. వారికి తిరిగొ ఇవ్వాలనే ఉద్దేశంతో నా ఫ్యాన్స్‌ క్లబ్స్‌ను ఒకే ఆర్గనైజేషన్‌గా మార్చా. సామాజిక సేవ చేస్తాం’’ అని పేర్కొన్నారు  ప్రముఖ ఎడిటర్‌ మోహన్‌ కుమారుడే రవి. దర్శకుడు మోహన్‌ రాజా ఆయన సోదరుడు. ‘బావ బావమరిది’, ‘పల్నాటి పౌరుషం’ చిత్రాల్లో బాల నటుడిగా సందడి చేసిన రవి.. తమిళ్‌లో ‘జయం’ (తెలుగు సినిమా జయం రీమేక్‌)తో హీరోగా ఎంట్రీ ఇచ్చి, తొలి ప్రయత్నంలోనే మంచి విజయం అందుకున్నారు. అలా ‘జయం రవి’గా మారారు. గతేడాది ‘సైరెన్‌’, ‘బ్రదర్‌’ చిత్రాలతో అలరించిన ఆయన ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు.

Updated Date - Jan 14 , 2025 | 12:04 AM