Dhanush: అందమైన భామలతో 'జాబిలమ్మ నీకు అంత కోపమా'
ABN , Publish Date - Feb 15 , 2025 | 06:03 PM
తమిళ స్టార్ హీరో ధనుష్ లో మంచి దర్శకుడూ ఉన్నాడు. ఇప్పటికే ధనుష్ (Dhanush) 'పా పాండి, రాయన్' చిత్రాలను డైరెక్ట్ చేశాడు. ఇందులో రెండో సినిమా 'రాయన్' గత యేడాది విడుదలైంది. తాజాగా తన మేనల్లుడు పవిష్ ను హీరోగా పరిచయం చేస్తూ ధనుష్ ఓ తమిళ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు.
తమిళ స్టార్ హీరో ధనుష్ లో మంచి దర్శకుడూ ఉన్నాడు. ఇప్పటికే ధనుష్ (Dhanush) 'పా పాండి, రాయన్' చిత్రాలను డైరెక్ట్ చేశాడు. ఇందులో రెండో సినిమా 'రాయన్' గత యేడాది విడుదలైంది. తాజాగా తన మేనల్లుడు పవిష్ ను హీరోగా పరిచయం చేస్తూ ధనుష్ ఓ తమిళ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. అది ఫిబ్రవరి 21న విడుదల కాబోతోంది. ఇప్పుడా చిత్రాన్ని తెలుగులో ఫిబ్రవరి 21నే ఏషియన్ సురేశ్ ఎంటర్ టైన్ మెంట్స్ 'జాబిలమ్మ నీకు అంత కోపమా' (Jabilamma Neeku Antha Kopama) పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ హైదరాబాద్ లో మీడియా సమావేశంలో పాల్గొంది.
ఈ సందర్భంగా ఏషియన్ సురేష్ సంస్థకు చెందిన జాన్వీ నారంగ్ (Janhvi Narang) మాట్లాడుతూ,''ఓ కొత్త ప్రేమకథతో జనం ముందుకు రాబోతున్నాం. తెలుగులో ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన ధనుష్ గారికి కృతజ్ఞతలు. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది'' అని అన్నారు. ఇప్పటికే తెలుగువారికి సుపరిచితురాలైన అనికా సురేంద్రన్ (Anikha Surendran) 'ఈ సినిమా సపోర్ట్ చేయమ'ని ప్రేక్షకులను మీడియా ముఖంగా కోరింది. హీరో పవిష్ (Pavish) మాట్లాడుతూ, 'దర్శకుడు వెంకీ అట్లూరి కారణంగానే నేను కెమెరా ముందుకు వచ్చాను. ధనుష్ సార్ నుండి ఎంతో నేర్చుకున్నాను. ఆయన నటన ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడేవారు కాదు. తాను నటించిన 'రఘువరన్ బీటెక్', 'తిరు' వంటి సినిమాలు చూడమని సలహా ఇచ్చారు. దాంతో నటన, వాచకం గురించి కొంత అవగాహన ఏర్పడింది'' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నటి రబియా, వెంకటేశ్ మీనన్ , రమ్య రంగనాథన్ (Ramya Ranganathan) తదితరులు పాల్గొని సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు.