Toxic: 'టాక్సిక్ అంతర్జాతీయ స్థాయి కథ 

ABN , Publish Date - Feb 26 , 2025 | 04:47 PM

'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రౌన్-అప్స్' (Toxic: A Fairy Tale for Grown-Ups) భారతీయ చిత్రసీమలో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ఇంగ్లీష్ కన్నడ రెండింటిలోనూ చిత్రీకరించబడిన మొట్టమొదటి బిగ్ స్కేల్ భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించనుంది.

'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రౌన్-అప్స్' (Toxic: A Fairy Tale for Grown-Ups) భారతీయ చిత్రసీమలో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ఇంగ్లీష్ కన్నడ రెండింటిలోనూ చిత్రీకరించబడిన మొట్టమొదటి బిగ్ స్కేల్ భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించనుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం వంటి భాషల్లో డబ్బింగ్ చేయనున్నారు. రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ఈ చిత్రాన్ని, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన గీతూ మోహనదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా కన్నడలో భారతీయ ప్రేక్షకులకు, ఇంగ్లీష్‌లో ప్రపంచవ్యాప్తంగా అందరికీ కనెక్ట్ అయ్యెలా రూపొందించబడింది.

డైరెక్టర్  గీతూ మోహనదాస్ (Geetu Mohandas) మాట్లాడుతూ - "'టాక్సిక్' కోసం మేము ఒక అంతర్జాతీయ స్థాయి కథను సృష్టించాలనుకున్నాం. ఇది భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలి. అందుకే కన్నడ, ఇంగ్లీష్ రెండింటిలోనూ చిత్రీకరించాం. ఈ సినిమా భాషలు, సాంస్కృతిక భేదాలను దాటి అందరి హృదయాలను తాకేలా ఉంటుంది" అన్నారు. 

నిర్మాత వెంకట్ నారాయణ (Venkat K. Narayana) మాట్లాడుతూ "టాక్సిక్’ విషయంలో మా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆకట్టులునే చిత్రంగా టాక్సిక్‌ను రూపొందిస్తున్నాం. 'టాక్సిక్' తప్పకుండా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది, అలాగే భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుంది" అన్నారు.

యష్‌ తన 'మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్' సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  వెంకటేష్ కె నారాయణ మరో నిర్మాత. ఈ చిత్రంలో హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలను రూపొందించేందుకు ‘జాన్ విక్’ మరియు ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సినిమాల్లో పని చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్ జెజె పెర్రీని తీసుకున్నారు. అలాగే, విజువల్ ఎఫెక్ట్స్ కోసం ‘డ్యూన్: పార్ట్ 2’ సినిమాకు బీఏఎఫ్టీఏ అవార్డు గెలుచుకున్న DNEG స్టూడియో పని చేస్తోంది. యష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన 'బర్త్‌డే పీక్' టీజర్, సినిమా గ్రాండియర్ ని ప్రజెంట్ చేస్తోంది. సినిమా షూటింగ్ 2024 ఆగస్టులో ప్రారంభమైంది.  ఇది ఇప్పటివరకు తీసిన హయ్యస్ట్ బడ్జెట్ భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది.

Updated Date - Feb 26 , 2025 | 04:51 PM