Ilayaraja: మోదీజీతో మర్చిపోలేని మీటింగ్ ఇది

ABN , Publish Date - Mar 18 , 2025 | 05:15 PM

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ప్రధాని నరేంద్ర మోదీని  మర్యాదపూర్వకంగా కలిశారు. ఎందుకంటే

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilairaaja) ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)ని  మర్యాదపూర్వకంగా కలిశారు. సంబంధిత ఫొటోలను మ్యూజిక్‌ డైరెక్టర్‌ సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు. ‘‘మోదీజీతో ఎప్పటికీ మర్చిపోలేని మీటింగ్ ఇది. నా ‘సింఫొనీ- వాలియంట్‌’ సహా పలు అంశాలపై చర్చించాం. ఆయన ప్రశంసలు, మద్దతుకు కృతజ్ఞతలు’’ అని పోస్ట్ లో పేర్కొన్నారు. 

లండన్‌లో ఇటీవల ఇళయరాజా ‘వాలియంట్‌’ పేరిట మ్యూజికల్‌ ఈవెంట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. లండన్‌లో వెస్ట్రన్‌ క్లాసికల్‌ సింఫొనీ నిర్వహించిన తొలి ఆసియా మ్యూజిక్‌ కంపోజర్‌గా ఇళయరాజా రికార్డు సృష్టించారు. భవిష్యత్తులో.. 13 దేశాల్లో ‘వాలియంట్‌’ నిర్వహించనున్నారు. దానితో పాటు సంగీతదర్శకుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం భారీ వేడుక నిర్వహించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి స్టాలిన్ ఇళయరాజాను కలిశారు. 

Updated Date - Mar 18 , 2025 | 05:19 PM